Samantha: ఖుషి డే 1కలెక్షన్స్.. విజయ్ కెరీర్ బెస్ట్!

Samantha:

టాలీవుడ్ లో సెప్టెంబర్ 1 నుండే సినిమాల సందడి మొదలైపోయింది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అందరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ సాధించింది. దాదాపు 1500 లకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఖుషి సినిమా ఫస్ట్ డే విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది.

ఒక్కసారి ఏరియా వైస్ కలెక్షన్లను గమనిస్తే ఒక్క తెలంగాణలోనే 5.15 కోట్లకి పైనా షేర్ వసూలు చేసింది. ఇక ఆంధ్రలో అన్ని ఏరియాలను కలిపి 4.71కోట్ల షేర్ వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా, ఇతర భాషల కలెక్షన్లు కలిపి 1.30కోట్ల షేర్ సాధించగా, అందరూ ఊహించినట్టే ఓవర్సీస్ లోను కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ సాధించింది. అక్కడ ప్రీమియర్స్ తో కలిపి ఖుషి 4.20కోట్ల షేర్ రాబట్టడం విశేషం.

Kushi's first day collections..
Kushi’s first day collections..

ఇక ఖుషి వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే15.37కోట్ల షేర్ రాబట్టగా, 27.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఖుషి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించడం విశేషం. ఇంతకు ముందు లైగర్ 13 కోట్ల షేర్ సాధించగా, ఒక క్లాస్ మూవీతో దాన్ని బ్రేక్ చేయడం విశేషం.

- Advertisement -

ఇక ఖుషి 53కోట్ల బిజినెస్ చేయగా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 38కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. అయితే వచ్చిన టాక్ ని క్రేజ్ ని బట్టి వీకెండ్ లోనే ఈ సినిమా 70శాతం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు