RGV’s Vyuham: వ్యూహం టైటిల్ సాంగ్ లిరిక్స్ లీక్..!

RGV’s Vyuham

2024 ఎలక్షన్ టార్గెట్ గా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వైఎస్ జగన్ జీవితంలోని ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా వ్యూహం. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. అపోజిషన్ లీడర్స్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేస్తుండటంతో వివాదాస్పదంగా మారింది. తరచూ ఈ సినిమాకి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ లీక్ అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా వ్యూహం టైటిల్ సాంగ్ లిరిక్స్ లీక్ అయ్యాయి. పులుల వేషంలో గుంట నక్కలు అంటూ సాగే ఈ సాంగ్ లో ప్రధానంగా చంద్రబాబుని టార్గెట్ చేసినట్లే అనిపిస్తుంది.

పులుల వేషంలో గుంట నక్కలునిక్క బొడిచి ఆడుతున్న రాజకీయ  వ్యూహం…
దొరల వేషంలో లో సర్పరాజులు
వెన్ను నిమిరి విషం విసిరే పన్నాగం
నక్క తెలివి తేటలతో వరుస హత్యలు
మంచినం ముసుగేసే సత్య హరిశచంద్రులు

ఈ వ్యూహం (X2)

- Advertisement -

నరకాసుల దుర్మార్గం
రాబందుల రాజకీయంజగనుడి… బాణం ….
రాక్షసుల సంహారం…..

వ్యూహం……
వ్యూహం …. వ్యూహం….
ఓం వ్యూహం

Aim  వ్యూహం
హ్రీం వ్యూహం
క్లీమ్ వ్యూహం

మెయిన్ గా 2014 నుండి 2019వరకు జరిగిన సంఘటనలను ఆధారంగా ఉన్న ఈ లిరిక్స్ జగన్ పొలిటికల్ క్యాంపెయిన్ కి బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయనే చెప్పాలి. అజ్మల్, రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. 2019 ఎలక్షన్ కి ముందు కూడా రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలు పొలిటికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ హీట్ పెరిగిన నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు