Vyuham: ప్రచార వ్యూహం తప్ప వాస్తవం ఉండదా..? 

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల బ్యాక్డ్రాప్ లో రూపొందిన సినిమా వ్యూహం. 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిన నాటి నుండి వైఎస్ జగన్ సీఎం అయ్యేంతవరకు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్, ముందుగా అనుకున్నట్టే జగన్ కి ఫేవర్ గా, చంద్రబాబుకి వ్యతిరేకంగా రూపొందించాడు వర్మ ఈ టీజర్. గతంలో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలను ఇదే స్ట్రాటజీతో రూపొందించాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రచారంలో ఉన్న అంశాలే ప్రధానంగా తెరకెక్కించి వైసీపీకి క్యాంపెయినింగ్ యాడ్ తరహాలో రిలీజ్ చేసాడు.

ఇప్పుడు వ్యూహం సినిమా ద్వారా కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. వైఎస్ మరణం చుట్టూ ప్రచారంలో ఉన్న కథలను బేస్ చేసుకొని వైసీపీకి అనుకూలంగా రూపొందించినట్టు ఉంది తప్ప ఈ సినిమాలో వేరే కోణం ఉన్నట్లు కనిపించట్లేదు. వ్యూహం సినిమా ద్వారా వర్మ టచ్ చేసిన సబ్జెక్టు  తెలుగు రాష్ట్రాల వరకే కాకుండా ఢిల్లీని కూడా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

ఏదేమైనా నిజమో కాదో తెలియని, ప్రచారంలో ఉన్న కథలను తీసుకొని సినిమా తీస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ తరహాలో ప్రతిసారి వర్కౌట్ అవుతుందనుకుంటే అంతకుమించిన మూర్ఖత్వం ఉండదు. 2024 ఎలెక్షన్ టార్గెట్ గా రాబోతున్న ఈ వ్యూహం ముందు ముందు రాజకీయంగా ఎన్ని వివాదాలు రేపుతుందో, వైసీపీకి ఏ మేరకు పొలిటికల్ మైలేజ్ ఇస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు