Mega star: ల్యాండ్ అయిన భోళా శంకర్ ! వింటేజ్ మెగా స్టార్ ఈజ్ బ్యాక్ ?

మెగా ఫ్యాన్స్ అంత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భోళా శంకర్ టీజర్ ఎట్టకేలకు రిలీజైయింది. మాస్ డైలాగ్స్ తో మెగా స్టార్ వింటేజ్ లుక్స్ తో నిండిన టీజర్ చూస్తుంటే సినిమాలో కంప్లిట్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నట్టు తెల్సుతోంది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అజిత్ హీరోగా తమిళ్ లో సూపర్ హిట్టైన వేదళమ్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవలనే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఉత్తరాంధ్ర స్లాంగ్ లో మాట్లాడి ఫ్యాన్స్ లో జోష్ నింపిన మెగా స్టార్, భోళా శంకర్ సినిమాలో ఊర మాస్ తెలంగాణ స్లాంగ్ లో కనిపించనున్నట్టు తెల్సుతోంది. స్టేట్ డివైడ్ అయిన అంత నా వాళ్లే అనే డైలాగ్స్ కైతే బి,సి సెంటర్స్ లో ఫ్యాన్స్ గోల చేయడం పక్క అని అర్థమవుతోంది.

- Advertisement -

శంకర్ దాదాMBBS సినిమాలో హైదరాబాద్ పాత బస్తి స్లాంగ్ లో మాట్లాడి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచనాలు సృష్టించిన మెగా స్టార్ మళ్ళీ భోళా శంకర్ కి కూడా అదే హిట్ సెంటిమెంట్ ని వర్క్ అవుట్ చేసినట్టు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది

అయితే ఈ సినిమా మెగా స్టార్ చిరంజీవి కంటే దర్శకుడు మెహర్ రమేష్ కి కీలకంగా మారనుంది. మెహర్ చేసిన సినిమాలన్నీ దాదాపు ఫ్లాప్ అవడం కారణంగా ఆయనతో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్స్ , హీరోలు ఎవరు ఆసక్తి చూపించలేదు. దాంతో చాలా కాలం గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్ వేదళంసినిమాపై వర్క్ చేసి మెగా స్టార్ ని ఒప్పించి, సినిమా పట్టాలెక్కించాడు. ఇక ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే మెహర్ రమేష్ ఇంకో సినిమా పట్టుకోడానికి మరో పదేళ్ళైనా పడుతుంది. అందుకే మెహర్ రమేష్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగావ్యవహరిస్తున్నాడు. భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మధ్య కాలంలో వస్తోన్న
అన్ని సినిమాలలో తెలంగాణ స్లాంగ్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి హిట్ అవుతున్న తరుణంలో భోళా శంకర్ కూడా అలాగే హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు