BholaaShankar: యాస మార్చితే సరిపోతుందా – సహజత్వం అక్కర్లేదా..?

ఇటీవలి కాలంలో మన హీరోలు సినిమా సినిమాకు లుక్స్ మార్చినట్టుగానే స్లాంగ్ కూడా మార్చుతున్నారు. గతంలో వచ్చిన సినిమాల్లో సినిమా కథ ఏ ఏరియా బ్యాక్డ్రాప్ లో ఉన్నా కానీ, సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ ఒకే తరహా బుకిష్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉండేవి. అప్పట్లో కమెడియన్లు, విలన్లు మాత్రమే రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన యాసలో మాట్లాడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పాలి, సినిమా కథను బట్టి ఆ ప్రాంతానికి చెందిన యాసలో హీరో సహా మిగతా పాత్రలు కూడా మాట్లాడటం ఎక్కువయ్యింది. అయితే, ఇక్కడే ఉంది అసలు సమస్య అంతా. సినిమాల్లో పాత్రలు సదరు యాసలో ఉన్న బ్యూటీని పట్టుకొని సరైన అవుట్ ఫుట్ ఇవ్వగలిగితే వర్కౌట్ అవుతుంది కానీ, ఏ మాత్రం ఆర్టిఫీషియల్ గా ఉన్నా కూడా మొదటికే మోసం వస్తుంది.

ఈ జనరేషన్ హీరోల్లో ఏ యాసనైనా ఇట్టే పెట్టగల స్కిల్ ఉన్న నటులు అంటే మహేష్ బాబు, ఎన్టీఆర్ ల పేర్లు మొదటగా గుర్తొస్తాయి అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో  మహేష్ గోదావరి యాసను పర్ఫెక్ట్ గా పలికించాడని చెప్పచ్చు. అరవింద సమేతలో ఎన్టీఆర్ రాయలసీమ యాసని, అదుర్స్ సినిమాలో టిపికల్ బ్రాహ్మణుల డిక్షన్ ని పర్ఫెక్ట్ గా దించేసాడు. ఇక జాతిరత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా తెలంగాణ యాసని పర్ఫెక్ట్ గా ప్రాజెక్ట్ చేసాడు.

ఇక యాసని పలికించటంలో ఆర్టిఫీషియల్ గా పలికించిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలను ఉదాహరణగా చెప్పవచ్చు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి ఉత్తరాంధ్ర యాసలో కృత్రిమత్వం కొట్టొచ్చినట్టు కనపడిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. తాజాగా, చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా టీజర్ రిలీజ్ అవగా, అందులో కూడా తెలంగాణ యాసలో ఉన్న చిరు డైలాగ్స్ లోని యాస ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది. టీజర్లో ఉన్నట్లే సినిమా అంతా అదే ఆర్టిఫిషియలిటీ కనిపిస్తే మాత్రం ఆడియెన్స్ కనెక్ట్ అవ్వటం కష్టమే అని చెప్పాలి. రీమేక్ కావటంతో పెద్దగా బజ్ క్రియేట్ కాని భోళాశంకర్ ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు