Adhipurush : ప్రభాస్ తో సినిమాపై స్పందించిన లోకేష్ కనకరాజ్

ప్రస్తుతం ఇండియాలో ఉన్న డైరెక్టర్స్ అందరు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం అందరికి తెలిసిందే. బాహుబలి సినిమాతో ప్రభాస్ వరల్డ్ సినిమాకి పరిచయమవడంతో ప్రభాస్ తో సినిమా చేస్తే ఆటోమాటిక్ అది అందరికి రీచ్ అవుతుందని నమ్ముతున్నారు. దానికి తోడు ఇటీవలనే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ వరకు తెలుగు సినిమా స్థాయి పెరిగిపోవడంతో ఇంటర్నేషనల్ గా టాలీవుడ్ కి గుర్తింపు లభించింది.

ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే , రాజా డీలక్స్ సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాల తరువాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్ కూడా స్పిరిట్ అని కన్ఫామ్ చేసేసారు. అయితే లేటెస్ట్ గా మరో క్రేజీ దర్శకుడు కూడా ప్రభాస్ తో కలిసి పని చేయడానికి రెడీ ఉన్నట్టు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే, ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ప్రకంపనలు సృష్టించిన లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లులలో లోకేష్ కనకరాజ్ కూడా ఒకడు. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాలో తనదైన మార్క్ కనబరుస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్తానం సంపాదించుకున్నాడు. ఇటీవలనే ఒక ఇంటర్యూలో లోకేష్ కనకరాజ్ ప్రభాస్ తో సినిమాపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అవేంటంటే ప్రభాస్ తో తాను చేయబోయే సినిమా ప్రభాస్ కెరీర్ లోనే మరియు తన కెరీర్ లోనే అతిపెద్ద చిత్రం అవుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

ప్రస్తుతం తలపతి విజయ్ తో లియో సినిమా తెరకెక్కిస్తున్న లోకేష్ కనకరాజ్. ఈ సినిమా తరువాత ప్రభాస్ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ సస్టార్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు