Balagam: అమేజింగ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న వేణు – స్టార్ హీరోలు కన్విన్స్ అవుతారా…?

బలగం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని సంచలనం సృష్టించాడు కమెడియన్ వేణు. అతి తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బలగం ఇచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న వేణు, ప్రస్తుతం రూరల్ బ్యాక్డ్రాప్ లో మరొక స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, డప్పు కళాకారుడి స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు ఎదిగిన తెలంగాణ పల్లెకి చెందిన కుర్రాడి కథతో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే, తన రెండో సినిమా స్టార్ హీరోలతో చేయాలనీ డిసైడ్ అయిన వేణు, ఈ స్క్రిప్ట్ తో స్టార్ హీరోలను కన్విన్స్ చేయగలడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రస్తుతం తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్ లో రూపొందే కథలకు మంచి డిమాండ్ ఉండటంతో అందరు హీరోలు నిర్మాతల దృష్టి అలాంటి కథల పైనే పడింది కాబట్టి కాస్త కసరత్తు చేసి స్టార్ హీరోలకు తగ్గట్టు కథని సిద్ధం చేస్తే వారిని ఒప్పించటం వేణుకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఆ మధ్య వేణు తన నెక్స్ట్ సినిమా కోసం వెంకటేష్, రాజశేఖర్ ల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి.ఇందుకు సంబంధించి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు కానీ, ఇప్పుడు స్క్రిప్ట్ గురించి వస్తున్న న్యూస్ మాత్రం సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీ చూపుని తనవైపు తిప్పుకున్న వేణు నుండి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్న తరుణంలో మరొక తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్న కథ సిద్ధం చేస్తున్నాడన్న న్యూస్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల మోజులో ఉన్న మెయిన్ స్ట్రీమ్ హీరోలు వేణు సిద్ధం చేస్తున్న స్క్రిప్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, ఈ ప్రాజెల్ట్ కార్యరూపం దాల్చుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు