SSMB29: మహేష్-రాజమౌళి సినిమాపై మైండ్ బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన విజేంద్ర ప్రసాద్

రాజమౌళి- మహేష్ బాబు సినిమాపై ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమా అనంతరం రాజమౌళి సినిమా పనుల్లో బిజీ అవనున్నాడు.

దాదాపు ఒక సినిమా చేయడానికి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వరకు సమయం తీసుకునే రాజమౌళి మహేష్ తో సినిమా అంటే ఇంకెంత సమయం తీసుకుంటాడో అనే భయం అందరిలోను ఉన్న, అవుట్ ఫుట్ కూడా పదేళ్లు చెప్పుకునేలా ఉంటుంది కాబట్టి మహేష్ ఫ్యాన్స్, సినీ అభిమానులు ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు.

మహేష్ లో ఉన్న యాక్టర్ ని ఎవరు సరిగా ఉపయోగించుకోవట్లేదనే కంప్లయింట్ ఎప్పటి నుంచో ఉండటంతో రాజమౌళి సినిమాతో మహేష్ యాక్టింగ్ పొటెన్షియాలిటీ బయటికి వస్తుందని అందరిలో పాజిటివిటి ఏర్పడింది.

- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి దర్శకుల వరుసలో చేరిన రాజమౌళి మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో అని ఆ విజువల్ గ్రాండియర్ ఎలా ఉండబోతుందో అని ఇప్పటికే అంచనాలు తార స్థాయిలో పెట్టుకొని అందరు వెయిట్ చేస్తుండగా. ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ని రైటర్ విజేంద్ర ప్రసాద్ మీడియాకి లీక్ చేసారు.

గతంలో విజేంద్ర ప్రసాద్ మహేష్ తో రాజమౌళి చేయబోయే సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో సాగే యాక్షన్ అడ్వెంచర్ అని ఆయన చెప్పిన సంగతి తెల్సిందే. ఇప్పటికే గత 8 నెలలుగా సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్న విజేంద్ర ప్రసాద్ వచ్చే జులై చివరికల్లా సినిమా స్క్రిప్ట్ కంప్లిట్ చేసి రాజమౌళి కి సబ్మిట్ చేస్తానని చెప్పాడు.

ఆ తరువాత సినిమాకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్స్ పనులు మొదలు పెడతామని ఆయన వివరించారు. అయితే ఈ సినిమా కోసం ఇప్పటికే మహేష్ మేకోవర్ పై కూడా దృష్టి పెట్టాడంట. ఈ సినిమాలో మహేష్ అతిథి సినిమా తరహా లాంగ్ హెయిర్ లో కనిపించబోనున్నాడట. ఇండియానా జోన్స్ ప్రాంచైజ్ తరహాలో సినిమా ఉండబోతుందని. అలాగే సినిమాకి ఎండ్ కూడా ఉండదని, ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండొచ్చని ఆయన చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు అందరిలో నూతన ఉత్సహం వచ్చింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు