Malli pelli : నరేష్ ని వెంటాడుతున్న ఆయన మూడో భార్య!కన్ఫ్యూజన్ లో పవిత్ర లోకేష్ ?

నరేష్- పవిత్ర లోకేష్ ల ప్రేమకథ ఇప్పుడప్పుడో సుకాంతం అయ్యేటట్టు లేదు. ఇటీవలనే పెళ్లి చేసుకొని కొత్త కాపురం స్టార్ట్ చేసిన వీళ్ళిద్దరిని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నీడలాగా వెంటాడుతూనే ఉంది. అయితే నరేష్ కు ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి డివర్స్ అయ్యి చాలా కాలమే అయిన ఇప్పటికి నరేష్ జీవితంలో ఈమె ఎందుకు ఇంతగా కలగా జేసుకుంటుందో ఎవరికి అంతు చిక్కకుండా ఉంది.

సూపర్ స్టార్ కృష్ణ -విజయ నిర్మల వారసుడిగా సినీ పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన నరేష్ తన సినిమాల ద్వారా అందరికి పరిచయస్తుడే, గతంలో హీరోగా పలు చిత్రాలలో నటించి, గుర్తింపు తెచ్చుకున్న నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలివుడ్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు.

అయితే ఈయన తెలుగు, కన్నడ సినిమాలలో మదర్ క్యారెక్టర్స్ మరియు ప్రధాన పాత్రలలో నటించే పవిత్ర లోకేష్ ని ప్రేమించాడు. దాంతో రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చి ఇటీవలనే పవిత్రని పెళ్లి కూడా చేసుకున్నాడు. వీళ్ళ ప్రేమ, పెళ్లి గుర్తుగా ప్రముఖ ప్రొడ్యూసర్ యంయస్ రాజు దర్శకత్వంలో మళ్ళీ పెళ్లి అనే సినిమా కూడా తీశారు.

- Advertisement -

రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తే ఉన్నప్పటికీ, కథ కథనంలో ఉన్న లోపల వల్ల సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఈ సినిమాలో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి క్యారెక్టర్ ను కించపరిచే విధంగా చూపించారని సినిమా రిలీజ్ వెంటనే ఆపేయాలని ఆమె కోర్ట్ లో కేస్ వేయగా, అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయింది.

ఇటీవలనే ఈ సినిమా థియేటర్ రన్ కంప్లిట్ చేసుకొని, ఓటిటిలో విడుదలైంది. ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ లలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం ఆహా లో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది .

దీనికి కారణం.. ఈ సినిమా థియేటర్ రన్ ని ఆపలేకలేకపోయిన రమ్య రఘుపతి ఇప్పుడు ఓటిటిలో ఈ సినిమాని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె హైదరాబాద్ ఫ్యామిలీ కోర్ట్ లో ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ ఆమె కేస్ వేసింది. దాంతో నరేష్- పవిత్ర మళ్ళీ కోర్ట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కనబడుతోంది. మళ్ళీ పెళ్లి సినిమా ఫ్లాప్ అయిన, తన క్యారెక్టర్ బ్యాడ్ చేసి చూపించడంతో డీప్ గా హర్ట్ అయిన రమ్య రఘుపతి నరేష్ మీద రివెంజ్ తీసుకోడానికి ఎంత దూరం అయిన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరీ ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు