Ashu Reddy: అమెరికా టు డ్రగ్ మాఫియా – వ్యామోహమే కొంప ముంచిందా..?

తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి సినిమా అంటే వినోదం మాత్రమే కాదు అదొక పిచ్చి. అది ప్రతి శుక్రవారం థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం వరకు పరిమితం అయితే, ఇబ్బందేమీ లేదు కానీ పిచ్చి కాస్తా వ్యసనంగా మారి హైదరాబాద్ ట్రైన్ ఎక్కేవరకూ దారి తీస్తేనే ఇబ్బంది. అలా సినిమా పిచ్చి ముదిరి హైదరాబాద్ బాట పట్టిన వారిలో సక్సెస్ అయిన వాళ్లు ఉన్నప్పటికీ, ఆ సంఖ్య వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేంత మాత్రమే అని చెప్పవచ్చు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే, టాలీవుడ్లో తాజాగా వెలుగు చుసిన డ్రగ్స్ మాఫియా గురించి. డ్రగ్స్ కేసులో గతంలో చాలాసార్లు టాలీవుడ్ స్టార్ల పేర్లు వినిపించినప్పటికీ, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు, సోషల్ మీడియా సెలెబ్రిటీల పేర్లు సైతం వినిపిస్తుండటం చర్చనీయాంశం అయ్యింది.

జూన్ 14న తెలుగు ప్రొడ్యూసర్ కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేయటంతో ఈ ఉదంతం బట్టబయలైంది. కేపీ చౌదరి లిస్ట్ లో సోషల్ మీడియా సన్సేషన్ అషు రెడ్డి, నటి సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత సహా 12మంది సెలెబ్రిటీల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో అందరికంటే ఎక్కువ వినిపిస్తున్న పేరు అశు రెడ్డి, నిజానికి అషు రెడ్డి ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని ఎన్నారై. సుమారు ఐదేళ్ల కిందట సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి టీవీ షోల వరకు ఎదిగి, సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీ స్టేటస్ ని సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో తర్వాత పలు సినిమాల్లో నటించిన అషు ఆ మధ్య ఆర్జీవీతో చేసిన ఒక వివాదాస్పద ఇంటర్వ్యూ ద్వారా వార్తల్లో నిలిచింది. అంతే కాకుండా, అషు రెడ్డి పార్టీ కల్చర్ కి బానిస అయ్యిందంటూ గతంలో వార్తలు వచ్చాయి.

తెలుగు ఫిలిం సర్కిల్స్ లో ఏ చిన్న పార్టీ జరిగినా అక్కడ ఈ బిగ్ బాస్ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ గెస్ట్ గా తయారయ్యిందని కూడా టాక్ వినిపించింది. లక్జరియస్ కార్లలో పికప్ అండ్ డ్రాప్స్, ఖరీదైన గిఫ్ట్స్ కి అలవాటు పడ్డ ఈ ఎన్నారై ముద్దుగుమ్మకి పబ్ కల్చర్ వ్యసనంగా మారిందని టాక్ వినిపించింది.ఇదే అంశాన్ని గతంలో Filmify ప్రచురించింది, ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియాలో అషు పేరు ప్రధానంగా వినిపించటం గతంలో వచ్చిన వార్తలకి బలం చేకూర్చుతోంది.

- Advertisement -

From America to Drug Mafia - Is it nostalgia

సినీ ప్రపంచంలోని తళుకు బెళుకుల మీద వ్యామోహంతో అమెరికాలో పీస్ ఫుల్ లైఫ్ వదులుకొని వచ్చి ఇక్కడ తరచూ వివాదాలతో సహవాసం చేస్తూ వార్తల్లో నిలుస్తూ తల్లిదండ్రులకు సైతం తలనొప్పిగా మారిన అషు రెడ్డి ఏడిపిసోడ్ ఔత్సాహిక నటీనటులకు ఒక హెచ్చరిక లాంటిదని చెప్పవచ్చు. డ్రగ్స్ కేసులో తన పేరు రావటాన్ని అషు ఖండించినప్పటికీ నెటిజన్లు మాత్రం వదలట్లేదు. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు