Kushi: ఈ అతి ప్రమోషన్స్ వల్ల మొదటికే మోసం వస్తే?

Kushi Promotions:

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, టాలెంటెడ్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం “ఖుషి”. సెప్టెంబర్ 1న విడుదల అవుతున్న ఈ సినిమాకి ప్రమోషన్లు కాస్త ముందు నుండే స్టార్ట్ చేసారు చిత్ర యూనిట్. అయితే ఖుషి సినిమాకి ముందు నుండే కావాల్సినంత హైప్ ఉంది. విజయ్ సమంత కాంబో ఒక ప్లస్ పాయింట్ అయితే, ఈ సినిమాకి హేషం అబ్దుల్లా అందించిన మ్యూజిక్, ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని పాటలు చార్ట్ బస్టర్ గా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

అయితే ఖుషికి అన్నిటికంటే మేజర్ ప్లస్ పాయింట్ “శివ నిర్వాణ”. ఈ డైరెక్టర్ గతంలో తీసిన నిన్నుకోరి, మజిలీ సినిమాలు ఎంత మంచి హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అలాంటి లవ్ స్టోరీని తెరకెక్కిస్తుడడంతో మూవీ లవర్స్ ఖుషి పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఖుషి ట్రైలర్ బాగున్నప్పటికీ స్టోరీ మొత్తం ట్రైలర్ లో చెప్పేసినట్టయింది. అందువల్ల కొందరు ఆడియన్స్ సినిమాపై అంత ఆసక్తిగా లేరని తెలుస్తుంది. దీనికి తోడు తాజాగా జరిగిన ఖుషి ప్రమోషన్ల ఈవెంట్ లో చిత్ర యూనిట్ కామంట్స్ కొంచెం అతి అవుతున్నట్టు నెటిజన్లు భావిస్తున్నారు. మామూలుగానే విజయ్ దేవరకొండ సినిమాల ప్రమోషన్లు అలాగే ఉంటాయని తెలిసిందే.

- Advertisement -

అయితే కొన్ని సినిమాలకు విజయ్ ప్రమోషన్లు ప్లస్ అయితే, లైగర్ లాంటి చిత్రాలకు అవే మైనస్ అయ్యాయి. ఇప్పుడు ఖుషి ఈవెంట్స్ లో కూడా విజయ్ దేవరకొండ కొంచెం అతి చేస్తున్నాడన్న ఫీలింగ్ కలుగుతుందంటున్నారు ఆడియన్స్. ఇక లేటెస్ట్ గా సమంత తో చేసిన స్టేజ్ పెర్ఫార్మన్స్ బాగానే ఉన్నా, కొందరు ఆడియన్స్ కి అతి చేస్తున్నారని అనిపిస్తుంది. దానివల్ల సినిమాకి కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా, అది అప్పటికప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది. దాంతో ఈ అతి ప్రమోషన్లే ఒక్కోసారి కొంపముంచే అవకాశం ఉంది.

ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ గమనిస్తే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే సినిమా కంటెంట్ బాగుంటే చాలు, ప్రేక్షకులు నెగిటివ్ అంశాలన్నీ పట్టించుకోకుండా సినిమాని హిట్ చేసేస్తారు. మరి ఖుషి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 1వరకు వెయిట్ చేయాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు