JrNTR latest movie : దేవర సర్ప్రైజింగ్ అప్డేట్ ఈరోజే

JrNTR latest movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా దేవర నుంచి ఈరోజు ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనుంది మూవీ టీం. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ అవనుంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా నుంచి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఒక క్రేజీ అప్డేట్ ను మూవీ టీం రివీల్ చేయనుంది.

అయితే ఈ అప్డేట్ ఎన్టీఆర్ కు సంబంధించిన అప్డేట్ ఆ.. లేక సినిమాలో వేరే ఆర్టిస్ట్ లకు సంబందించినధై ఉంటుందా అనే కన్ఫ్యూజన్ లో ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఫిల్మీ ఫై కి అందిన సమాచారం ప్రకారం ఈరోజు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజున ఉండటంతో ఆయనకు బర్త్ డే విషెష్ చెబుతూ ఒక పోస్టర్ ను దేవర మూవీ టీం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. గతకొద్ది రోజులుగా దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడా లేక వేరే ఏదైనా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడా అనే కన్ఫ్యూజన్ ఉండగా ఈరోజు మధ్యాహ్నం ఈ కన్ఫ్యూజన్ కు క్లారిటీ రానుంది.

ఇక దేవర సినిమాకి సంబంధించి గత కొద్దీ రోజులుగా నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటున్న సైఫ్ అలీ ఖాన్, ఇటీవలనే అనారోగ్యం కారణంగా అస్వస్థతకు గురి కావడంతో ప్రస్తుతం దేవర షూటింగ్ కు ఆయన దూరంగా ఉంటున్నాడు. ఆయన తిరిగి కోలుకున్న వెంటనే దేవర సినిమా షూటింగ్ మళ్ళీ రిస్యూమ్ అవనుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు