Rajinikanth: పండగ చేసుకుంటున్న జైలర్ నైజాం బయ్యర్లు!

Rajinikanth Jailer movie:

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో తెలుగు సినిమాలు అంచనాలను అందుకోలేకపోయినా, డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయిన జైలర్ మాత్రం థియేటర్లలో ఇరగదీస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కి చాలా రోజుల తరువాత ఒక పవర్ ఫుల్ కంబ్యాక్ ఈ సినిమాతో వచ్చిందని చెప్పవచ్చు. ఇక ముందుగా ఈ సినిమా రిలీజ్ కి ముందు మరీ ఓ రేంజ్ లో అంచనాలు లేకపోయినా, మామూలుగా రజినీకాంత్ సినిమాలకి చేసే సందడే జైలర్ కి జరిగింది.

అయితే సినిమాలో ఫ్యాన్స్ కి ఎలాంటి బూస్టప్ కావాలో అలాంటి మాస్ మీల్స్ నెల్సన్ ఇవ్వడంతో సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తూ నిర్మతలకు లాభాలని తెచ్చిపెడుతుంది. ఇప్పటికే 400కోట్ల మార్క్ ని జైలర్ క్రాస్ చేయగా 500కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా జైలర్ తెలుగు హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు మాత్రం పండగ చేసుకుంటున్నారని చెప్పాలి.

మామూలుగా రజినీకాంత్ సినిమాలకి తెలుగులోను స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో మంచి బిజినెస్ జరుగుతుంది. అయితే గత కొన్నాళ్లుగా రజినీకాంత్ సినిమా ట్రాక్ రికార్డు వల్ల జైలర్ కి తక్కువ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల హక్కులు 12 కోట్లకే అమ్ముడుపొగా, ఇక్కడ జైలర్ కొన్న డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలని సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా నైజాం రైట్స్ కొన్న బయ్యర్లు భారీ లాభాల్ని సొంతం చేసుకున్నారు.

- Advertisement -

జైలర్ నైజాం రైట్స్ కేవలం4.50 కోట్లు మాత్రమే. ఇక జైలర్ విడుదలైన 6రోజుల్లో ఒక్క నైజాం లో 13.26కోట్ల షేర్ సాధించింది. అంటే పెట్టిన బడ్జెట్ కి 8కోట్ల కి పైగా లాభాల్ని వెనకేసుకున్నారన్నమాట. ఇక లాంగ్ రన్ లో 15కోట్ల మార్క్ దాటనుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు