Jailer: నాలుగురోజుల్లో 300కోట్లు ఔట్..

Jailer 4days colllections:

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.రజినీకాంత్ కి చాలా రోజుల తరువాత ఒక మాస్ కం బ్యాక్ హిట్ ఈ సినిమా ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఆగష్టు 10 న విడుదలైన జైలర్ ఫస్ట్ షో నుండే భారీ కలెక్షన్లు సాధిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. గత కొంత కాలంగా ఫామ్ లో లేని రజినీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో చేస్తుండడంతో ఈ సినిమా పై భారీ బజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ మెప్పించడంతో ఫ్యాన్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారు.

ఇక అంచనాలకి తగ్గట్టు గానే సినిమా భారీ విజయం దక్కించుకోగా కేవలం మూడు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చింది. ఇక ఈ సినిమాలో రజినికాంత్ ఒక రిటైర్డ్ జైలర్ గా కనిపించిన విషయం తెలిసిందే. మొదటిరోజు జైలర్ 91.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కాగా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. తాజాగా నాలుగురోజుల్లో జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 148కోట్ల కి పైగా షేర్ సాధించగా 301 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ఒక్క ఓవర్సీస్ నుండే 125 కోట్లకి పైగా వసూళ్లు అందుకోవడం విశేషం.

- Advertisement -

జైలర్ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోగా, 25 కోట్ల ప్రాఫిట్ తో దూసుకుపోతుంది. ఇక జైలర్ ఓవరాల్ గా కలెక్షన్స్ ఎండ్ అయ్యే సరికి దాదాపు 60కోట్ల వరకు ప్రాఫిట్ అందుకోవచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి చూడాలి జైలర్ ఇంకెన్ని వసూళ్లు సాధిస్తుందో.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు