Indian patriotic movies: దేశభక్తిని రగిలించే టాప్ 10 బెస్ట్ మూవీస్

Top 10 Indian patriotic movies

భారత దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగష్టు 15న రావడం జరిగింది. అయితే ఆ స్వతంత్రం రావడం వెనక ఎంతో మంది మహా వీరుల పోరాటాలు, మరెందరో మహానుభావుల ప్రాణత్యాగాల వల్ల నేడు మనకి ఈ దేశం దక్కింది. అయితే ఆ వీరుల చరిత్రను చాటిచెప్పేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఆ రోజుల్లో కథలుగా చెప్పేవారు. 60స్ కాలంలో పాటల ద్వారా, పత్రికల ద్వారా, ఇప్పుడు సినిమాల ద్వారా వారి చరిత్రను చాటి చెప్తున్నారు. అలా స్వాతంత్రోద్యమ నేపథ్యంలో ప్రాణాలర్పించిన వీరుల చరిత్రను, అలాగే దేశభక్తి నేపథ్యలో స్ఫూర్తిని రగిలించే మొదటి 10 ఉత్తమ భారతీయ చిత్రాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్:

భారతదేశానికి స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన వీరుల్లో భగత్ సింగ్ ఒకరు. జలియన్ వాలాబాగ్ లాంటి మారణహోమాలను చూసి తట్టుకోలేకపోయిన భగత్ సింగ్ బ్రిటిష్ వారిని భారత్ నుండి వెళ్లగొట్టడానికి చంద్ర శేఖర్ ఆజాద్, ఇంకా తన మిత్రులు సుఖ్ దేవ్, రాజ్ గురులతో కలిసి ఎన్నో పోరాటాలు చేసాడు. అప్పటికీ మహాత్మా గాంధి అహింసా మార్గంలో వెళ్తున్నా, ఆయన సిద్దాంతాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాడాడు. అలాంటి భగత్ సింగ్ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన సినిమా “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్”. 2002 హిందీలో వచ్చిన ఈ సినిమాలో అజయ్ దేవగన్ భగత్ సింగ్ గా నటించాడు. భగత్ సింగ్ కి బాల్యం నుండి ఎదురైన సంఘటనలు, ఆయన బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన పోరాటాల గురించి కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో పాటలన్ని దేశభక్తిని రగిలించేవే. ముఖ్యంగా క్లైమాక్స్ లో భగత్ సింగ్ ని ఉరితీసే సీన్ కి కన్నీళ్లు పెట్టుకొని భారతీయుడు ఉండడు. ఈ చిత్రం ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

- Advertisement -

2.మంగళ్ పాండే ది రైజింగ్:

1857 లో సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో వచ్చిన సినిమా “మంగళ్ పాండే ది రైజింగ్”. బ్రిటిష్ వారిని వారి దగ్గరే పనిచేస్తున్న సైనికులు తమ దేశం కోసం ఎలా ఎదురుతిరిగి పోరాడారు. వాళ్లలో మొట్ట మొదట ఎదిరించిన భారత వీరుడు మంగళ్ పాండే బయోపిక్ గా ఈ సినిమా రూపొందింది. మంగళ్ పాండే గా అమీర్ ఖాన్ నటించగా ఈ చిత్రం 2005లో హిందీలో విడుదలయింది. ఇక ఈ చిత్రంలో భారతదేశంలో హిందూ, ముస్లిం మధ్య వైరం సృష్టించడానికి చేసిన ఘోరమైన ఎన్నో సన్నివేశాలను ఈ చిత్రంలో చూపించారు. అంతే కాదు మంగళ్ పాండే ఎదురుతిరిగిన తర్వాతే దేశంలోనే అనేకమంది ఏకం అయ్యారని చెప్తారు. ఈ చిత్రంలో మంగళ్ పాండే ని బ్రిటిష్ అధికారుల్ని కాల్చి చంపుతున్నపుడు పట్టుకుని ఉరి తీస్తారు. ఆ సన్నివేశంలో అక్కడి ప్రజలు ఏకమయ్యే దృశ్యాన్ని ఎంతో చక్కగా చూపించారు ఈ సినిమాలో. ఈ సినిమా కూడా ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

3.నేతాజీ సుభాష్ చంద్ర బోస్-ది అన్ ఫర్గెటన్ హీరో:
భారతదేశ వీరులని ఆర్మీగా తయారుచేసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మహావీరుడు సుభాష్ చంద్రబోస్. ఆయన జీవిత చరిత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా “నేతాజీ సుభాష్ చంద్ర బోస్” – ది అన్ ఫర్గెటన్ హీరో. ఈ చిత్రంలో నేతాజీగా ప్రముఖ నటుడు సచిన్ ఖడేకర్ నటించారు. ఒక ఆర్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ లాగా తెరకెక్కిన ఈ చిత్రంద్వారా సుభాష్ చంద్రబోస్ గురించి మనకి ఎన్నో తెలియని విషయాల్ని చెప్పడం జరిగింది. 2005లో హిందీలో విడుదలైన ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

4. సర్దార్ ఉద్దమ్ సింగ్:
1919లో జలియన్ వాలాబాగ్ మారణహోమానికి కారణమైన బ్రిటిష్ అధికారి డయ్యర్ ని వాళ్ళ దేశానికే వెళ్లి చంపి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఉద్దమ్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాయే “సర్దార్ ఉద్ధం సింగ్”. 2021లోనే ఓటిటి లో విడుదలైన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ కథానాయకుడిగా ఉద్ధం సింగ్ గా నటించాడు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులో కూడా ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

5.అల్లూరి సీతారామరాజు:
తెలుగులో స్వాతంత్రోద్యమ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు చరిత్రను తెలియచేస్తూ వచ్చిన చిత్రమిది. అల్లూరి గురించి ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించగా, 1974లో విడుదలయింది. అటవీ గిరిజనులను చిత్ర హింసలకు గురిచేస్తున్న బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన కథతో తెరకెక్కింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కృష్ణ అభినయం అద్భుతం. ఇక ఈ చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. దాంతో పాటు ప్రతి సంవత్సరం ఆగష్టు15న టీవీల్లో ఎదో ఒక ఛానల్ లో ప్రసారం చేస్తారు.

6.సైరా నరసింహారెడ్డి:
భారతదేశంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన తొలి తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2019లో విడుదలైంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించారు. రీసెంట్ గా వచ్చిన చిత్రాల్లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా వచ్చేవరకు నరసింహారెడ్డి అనే తెలుగు వీరుడు ఉన్నాడని చాలా మంది ప్రేక్షకులకి కూడా తెలియదు. ఇక ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

7. కలాపాని:

బ్రిటిష్ వారి కాలంలో భారతీయ వీరులను ఖైదీలుగా చేసి వారిని అండమాన్ జైళ్లలో ఎంతటి చిత్ర హింసలకు గురిచేసారో ఈ కాలాపాని అనే చిత్రం ద్వారా చెప్పారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించగా 1996లో మలయాళం లో విడుదలయింది. అయితే ఈ చిత్రం హిందీ, తెలుగులోనూ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

8. బోర్డర్:
1971 ఇండో- పాక్ యుద్ధ నేపథ్యంలో వచ్చిన సినిమా “బోర్డర్”. బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ మెయిన్ లీడ్ గా నటించిన ఈ చిత్రం భారత ఆర్మీ నేపథ్యంలో సాగుతుంది. 1997 లో విడుదలైన ఈ సినిమాలో అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి. ప్రతి సీన్ కూడా మనసుని కదిలిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఆర్మీ గొప్పతనం అర్ధమౌతుంది. ఇక ఈ చిత్రం హిందీలో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

9. రోజా: మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా టెర్రేరిజం నేపథ్యంలో తెరక్కెక్కింది. అరవింద్ స్వామి హీరోగా నటించిన ఈ సినిమాలో దేశభక్తి గురించి ఎంతో చక్కగా చాటిచెప్పారు. 1992 లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక ఈ అమెజాన్ ప్రైమ్ తో పాటు యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది.

10. ఖడ్గం:
తెలుగులో దేశభక్తి నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ముందు వరుసలో ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమా హిందూ,ముస్లింల ఐకమత్యానికి ప్రతీక గా తెరకెక్కింది. 2002లో వచ్చిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఇప్పటికీ పలు స్కూళ్లలో దేశభక్తి పాటలు ప్లే చేస్తున్నపుడు ఈ సినిమా పాటలు కూడా ఉంటాయి. ఇక ఈ చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

ఇవే కాకుండా మేజర్,ఘాజి, ఇండియన్ లాంటి ఎన్నో చిత్రాల్లో దేశభక్తిని చాటి చెప్పడం జరిగింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు