Megastar’s BholaShankar: జైలర్ నుండి మెగాస్టార్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి..!

Megastar’s BholaShankar

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా, మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా ఒకేసారి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి నుండి పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోగా, భోళాశంకర్ సినిమా ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని ఆచార్య కంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా అడుగులేస్తోంది. రొటీన్ మాస్ మసాలా కథకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను డైరెక్టర్ మెహర్ రమేష్ తన ఔట్ డేటెడ్ టేకింగ్ తో పదేళ్ల కాలం కిందటి సినిమా లాగా రూపొందించాడు. జబర్దస్త్ ఆర్టిస్ట్స్ తో ప్లాన్ చేసిన కామెడీ ట్రాక్ ఏ మాత్రం అలరించకపోగా ప్రేక్షకుడ్ని విసిగించింది.
మెగాస్టార్ ఖుషి సినిమాలోని నడుము సీన్ ని స్పూఫ్ చేయటం ఒక దారుణమైతే, ఆ స్పూఫ్ ని శ్రీముఖితో చేయటం ఇంకా దారుణం. ఈ దారుణాన్ని డై హార్డ్ మెగాఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. లుక్స్ పరంగా యంగ్ గా కనిపించి ఆకట్టుకున్న చిరంజీవి డ్యాన్స్ లో గ్రేస్, యాక్షన్ సీన్స్ లో ఎనర్జీతో మెప్పించినప్పటికీ సినిమాకి ఏ మాత్రం హెల్ప్ అవ్వలేకపోయాయి.  వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇంతటి డిజాస్టర్ రావటం మెగాఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేని రజినీకాంత్ కి జైలర్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ దక్కింది. నిజానికి జైలర్ సినిమా కథ కూడా గొప్ప కథ ఏమీ కానప్పటికీ, ఈ సినిమాలో రజినీకాంత్ తన ఏజ్ కి తగ్గ పాత్రలో కనిపించటం, డైరెక్టర్ నెల్సన్ రజినీ స్వాగ్ ని, స్టైల్ ని ఫ్యాన్స్ కి నచ్చే విధంగా ఎలివేట్ చేయటంతో జైలర్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
రజినీకాంత్ ని చూసి చిరంజీవి చాలా నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒకరకంగా ఆ కామెంట్స్ సరైనవే అని చెప్పాలి. RRR లాంటి సినిమాలతో టాలీవుడ్ స్థాయి ఆస్కార్ రేంజ్ కి ఎదిగిన నేపథ్యంలో మెగాస్టార్ ఇంకా రొటీన్ కమర్షియల్ కథలకు ప్రిఫరెన్స్ ఇస్తుండటం ఫ్యాన్స్ కి సైతం మింగుడుపడటం లేదు.
ఒక పక్క కమల్ హాసన్ , రజినీకాంత్ లాంటి సీనియర్లు తమ ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ తో సినిమాలు చేసి పాన్ ఇండియా హిట్స్ అందుకుంటున్న క్రమంలో చిరంజీవి స్టోరీ సెలెక్షన్ పరంగా ఆలోచనా తీరుని మార్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి, చిరు ఇకనైనా తాను మెగాస్టార్ అని ప్రూవ్ చేసుకోవాలని తాపత్రయం మానేసి ఇప్పటి ట్రెండ్ కి తగిన కథలతో సినిమాలు తనలోని వర్సటైల్ యాక్టర్ ని ఈ తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు