SuperStar’s Jailer: భోళా నెగిటివిటి జైలర్ కి ప్లస్ అయ్యిందా..?

SuperStar’s Jailer

తెలుగు సోషల్ మీడియా సర్కిల్స్ లో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్స్ ఒకటి మెగాస్టార్ భోళాశంకర్, రెండు సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్. చిరంజీవి సినిమాకి ఎన్నడూ లేని విధంగా నెగిటివిటి, విపరీతమైన ట్రోల్స్ సర్క్యులేట్ అవుతుండగా రజినీకాంత్ జైలర్ సినిమాను మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్స్. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండే భోళాశంకర్ సినిమా మీద మెగాఫ్యాన్స్ కూడా అయిష్టంగానే ఉన్నారు. రిలీజ్ అయ్యాక ముందుగానే ఊహించినట్లు రిలీజయ్యాక నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది భోళాశంకర్ సినిమా. ఇక మొదటి నుండి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన జైలర్ మాత్రం ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

భోళాశంకర్ సినిమాకి ఒకేరోజు ముందు రిలీజైన జైలర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే, తర్వాత రోజు రిలీజైన భోళాశంకర్ కి నెగిటివ్ టాక్ రావటంతో రెండో రోజు నుండి జైలర్ వసూళ్లు మరింత పికప్ అయ్యాయి. వాస్తవానికి జైలర్ సినిమాకు వచ్చిన టాక్ కి ఆ వసూళ్లు కరెక్టే అయినప్పటికీ భోళాశంకర్ సినిమాకి వచ్చిన నెగిటివిటి కారణంగా రెండో రోజు కలెక్షన్స్ లో డ్రాప్ ఉండాల్సింది పోయి పికప్ కనబడింది.

భోళాశంకర్ సినిమా గనక హిట్ టాక్ సొంతం చేసుకొని కచ్చితంగా జైలర్ స్పీడ్ కి బ్రేక్ పడి ఉండేది. జైలర్ సినిమా కథలో కూడా కొత్తదనం అన్నదేమి లేకపోయినప్పటికీ రజినీకాంత్ స్వాగ్, స్టైల్ ని ఫ్యాన్స్ కోరుకునే రేంజ్ లో ప్రొజెక్ట్ చేయటంలో డైరెక్టర్ నీల్సన్ దిలీప్ సక్సెస్ అయ్యాడు. భోళాశంకర్ సినిమా విషయంలో రొటీన్ కథ మెయిన్ మైనస్ పాయింట్ అయితే, మెగాస్టార్ లాంటి హీరోను సరిగ్గా వాడుకోలేకపోయిన డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంకో మైనస్ అని చెప్పాలి. ఆ రకంగా ఎబోవ్ యావరేజ్ సినిమాగా మిగలాల్సిన జైలర్ భోళాశంకర్ కి వచ్చిన నెగిటివిటి పుణ్యమా అని బ్లాక్ బస్టర్ అయ్యింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు