Mahanati Keerthy Suresh: దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డు వచ్చినట్టుంది కీర్తి పరిస్థితి..!

హీరోయిన్స్ కి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దొరకటం అనేది కష్టమవుతోంది ఈ రోజుల్లో. ముఖ్యంగా హీరో సెంట్రిక్ కథలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీస్ లో హీరోయిన్స్ కి సినిమాల్లో రెండు మూడు మంచి సీన్స్ పడటం కూడా రేర్ అని చెప్పాలి. అలాంటిది కెరీర్ తొలినాళ్లలోనే మహానటి క్లాసిక్ సినిమాలో నటించే అదృష్టం వరించిన కీర్తి సురేష్ కి తక్కువ గ్యాప్ లోనే ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి లకి చెల్లెలిగా నటించే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. లెజెండరీ యాక్టర్స్ కి చెల్లెలు పాత్ర అని చెప్పుకోవటానికి ఘనంగానే ఉంది కానీ, సినిమాల్లో విషయం వీక్ అవ్వటం, ఆ క్యారెక్టర్స్ కి యాక్టింగ్ కి పెద్దగా స్కోప్ లేకపోవటం వల్ల కీర్తికి పర్ఫామెన్స్ హైలైట్ అవ్వలేదు రెండు సినిమాల్లో కూడా.

పెద్దన్న, భోళాశంకర్ సినిమాల్లో స్కోప్ ఉన్నంత మేరకు కీర్తి సురేష్ బాగానే యాక్ట్ చేసినప్పటికీ సినిమాల్లో విషయం వీక్ అవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం లేకపోయింది. కీర్తి సురేష్ కి వచ్చిన ఈ లక్కీ ఛాన్స్ బహుశా ఏ హీరోయిన్ రాకపోవచ్చేమో. మహానటి సినిమా తర్వాత ఆ రేంజ్ లో పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కీర్తి సురేష్ కి రాలేదు. దసరా సినిమాలో కీర్తి నటనకి ప్రశంసలు వచ్చినప్పటికీ క్రెడిట్ మొత్తం హీరో నానికి దక్కింది.

మొత్తానికి ఈ జెనరేషన్లో ఏ హీరోయిన్ కి దక్కని ఛాన్స్ కీర్తికి వచ్చినప్పటికీ వాటి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేకపోయింది. పెద్దన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో, ఎప్పుడు పోయిందో తెలీని పరిస్థితి ఉండగా, భోళాశంకర్ సినిమా అయితే, ప్రీమియర్స్ నుండే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని డిజాస్టర్ దిశగా అడుగులేస్తోంది. సినిమా మీద ఉన్న నెగిటివ్ టాక్ కి తోడు ఏపీలో మెగాస్టార్ కి రాజకీయంగా ఏర్పడ్డ ప్రతికూలత కూడా భోళాశంకర్ ను దెబ్బ తీసింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు