RGV Tweets: చిరుకే చురక అంటించాడు..!

RGV Satires On Megastar

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) సినిమాను దశాబ్దాలుగా ఏలిన పేరు ఇది. కాదు కాదు ప్రభంజనం ఇది. అప్పటివరకు ఉన్న అగ్ర తారలు మధ్యలో కూడా వారికి సరైన పోటీ ఇచ్చి తనకంటూ ఒక సరికొత్త ఒకరకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకుని తెలుగు సినిమాను బాస్ మలుపు తిప్పాడు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ , ముఠామేస్త్రి వంటి కమర్షియల్ సినిమాలతో పాటు. ఆరాధన , రుద్రవీణ , స్వయం కృషి , ఆపత్బాంధవుడు వంటి ఎక్సపెరిమెంటల్ సినిమాలను కూడా చేసారు.

హిందీ లో రాజ్ కుమార్ తీసిన “మున్నాభాయ్ ఎమ్.బి.బి.ఎస్” సినిమాను తెలుగులో “శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్” గా తీసి మంచి హిట్ అందుకున్నారు.ఆ తరువాత అంతకు మించిన హైప్ తో వచ్చిన “శంకర్ దాదా జిందాబాద్” సినిమా బెడిసి కొట్టింది. ఆ తర్వాత చిరు రాజకీయ బాట అదంతా మనకు అప్రస్తుతం.సుదీర్ఘ కాలం తర్వాత రీసెంట్ గా బాస్ “ఖైదీ నెంబర్ 150” సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఏంట్రీ ఇచ్చారు.

ఆ రీ ఎంట్రీ ఫిల్మ్ కూడా రీమేక్ కావడం విశేషం.ఇకపోతే గాడ్ ఫాదర్, వేదాళం కూడా రీమేక్ సినిమాలే.రీసెంట్ గా రిలీజైన భోళా శంకర్ సినిమా విమర్శలు అందుకుంటున్న విషయం విధితమే . బాస్ రీ ఎంట్రీ తరువాత పెద్దగా హిట్ అయిన సినిమా అంటే అది “వాల్తేరు వీరయ్య” రీసెంట్ ఈ సినిమాపై ట్విట్టర్ వేధికగా రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసాడు.”వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బి ఎస్” అని వర్మ ట్వీట్ వేసాడు. అసలు దీని సారాంశం ఏంటంటే “వాల్తేరు వీరయ్య” సినిమా బాబీ మూలానే ఆడింది అని.ఇక్కడ బి ఎస్ అంటే బాబీ సంతోష్. బాబీ అసలు పేరు “కొల్లి సంతోష్ బాబీ” అందుకే వర్మ చివర్లో బి.ఎస్ అని చురక అంటించాడు. అలానే బి.ఎస్ అంటే “భోళా శంకర్”.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు