Megastar’s BholaShankar: మహాలక్ష్మే మంట కలిపిందా..?

Megastar’s BholaShankar

ఒక్కోసారి సినిమా విషయంలో కలిసొస్తుంది అనుకున్న అంశమే నెగిటివిటి తెచ్చి పెడుతూ ఉంటుంది. అది కథ కావచ్చు, హీరో డైరెక్టర్ కాంబినేషన్ కావచ్చు, హీరో హీరోయిన్ కాంబినేషన్ కావచ్చు, లేదా సినిమాలో ఏదైనా మెయిన్ క్యారెక్టర్ కూడా కావచ్చు. ఇటీవల విడుదలై నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న భోళాశంకర్ సినిమా విషయంలో కీర్తి సురేష్ క్యారెక్టర్ కూడా అదే కోవకు చెందుతుంది. ఇటీవల దసరా సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించింది.

కీర్తి సురేష్ సీనియర్ హీరోకి చెల్లెలిగా నటించటం ఇది ఫస్ట్ టైమ్ కాదు, ఆ మధ్య రజినీకాంత్ హీరోగా వచ్చిన పెద్దన్న సినిమాలో కీర్తి సురేష్ రజినీకాంత్ కి చెల్లెలిగా నటించింది.కెరీర్ తొలినాళ్లలోనే మహానటి లాంటి క్లాసిక్ లో నటించి తన నటనతో మెప్పించిన కీర్తి సురేష్, తక్కువ గ్యాప్ లోనే ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కి చెల్లెలి పాత్రలో నటించే లక్కీ ఛాన్స్ అందుకుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నప్పటికీ ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో కొంతమంది నెటిజన్స్ కీర్తి సురేష్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

రజినీకాంత్, చిరంజీవి లాంటి స్టార్స్ కి మహాలక్ష్మి లాంటి చెల్లెలి పాత్రలో కీర్తి నటించటం కలిసొస్తుంది అనుకుంటే ఆ మహాలక్ష్మే సినిమాను మంట కలిపిందని కూడా అంటున్నారు.పెద్దన్న, భోళాశంకర్ సినిమాలు ఫెయిల్ అవ్వటానికి కథలో కొత్తదనం లోపించటం వంటి అనేక కారణాలు ఉన్నప్పటికీ, కీర్తి సురేష్ ని కామన్ పాయింట్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. కోఇన్సిడెన్స్ అయినప్పటికీ, ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు పెద్దన్న, భోళాశంకర్ సినిమాలు ఫెయిల్ అవ్వటం కీర్తి సురేష్ కి ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ వచ్చేలా చేసింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు