Mahesh babu’s: గుంటూరు కారం- మరో ఘోరం

మహేష్ బాబు హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా గుంటూరు కారం.. ఘోరాలు ఇంకా తుది దశకు చేరుకునట్టు లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలువురు టెక్నీషియన్స్, నటీనటులు తప్పుకోగా లేటెస్ట్ గా ఈ సినిమాకు పని చేసే ఫైట్ మాస్టర్స్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు ఒక న్యూస్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది

 

మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రాబొత్తున్న గుంటూరు కారం సినిమా ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్ర బిందువు అవడం అందరికి తెలిసిందే. పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం మొదలు కొని పలు నటీనటుల, టెక్నీషియన్స్ ల ఈ సినిమా నుంచి వాక్ అవుట్ చేయడం జరుగుతూనే ఉంది.

- Advertisement -

శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ గుంటూరు కారం మొదటి నుంచి గందరగోళంగానే ఉంటుంది. మేకర్స్ ఈ సినిమా అంతర్గత విషయాలను ఎంతగా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్న కూడా ఆ వార్తలు ఏదో విధంగా బయటికి వచ్చి, గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. పోనీ ఈ గందరగోళంపై హీరోగాని డైరెక్టర్ గాని నోరు విప్పి ప్రేక్షకులకు ఏదైనా క్లారిటీ ఇస్తారా అంటే వాళ్ళు మీడియా ముందుకు రారు.. మాట్లాడారు. ఇక హీరో నెమో విదేశాల్లో ఉంటే స్వదేశం మూలల్లో డైరెక్టర్ దాక్కుంటాడు.

ఏ విషయాన్నీ తేల్చకుండా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటూ సినిమా చేయాలి అంటే అది జరగని పని. సరే ఈ గందరగోళం అంత ఎందుకు సినిమా నైనా ఆపేస్తారా.. అంటే లేదు.. ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేస్తామని పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. కానీ పరిష్టితి చూస్తే మాత్రం అందుకు మొత్తం వ్యతిరేకంగా ఉంటుంది. ఇక లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమాకు పని చేస్తోన్న ఫైట్ మాస్టర్ లు ఫైట్  రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఇలాగె కొనసాగితే ఇక సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఎవరో ఉంటారో ఎవరు లేకుండా పోతారో అగమ్య గోచరంగా ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు