Guntur Kaaram: తమన్ కూడానా…? ఇక సినిమా అయినట్టే..!

ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, గుంటూరు కారం సినిమా విషయంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా విషయంలో క్రియేట్ అయిన కాంట్రవర్సీస్ బహుశా ఏ స్టార్ హీరో సినిమా విషయంలో క్రియేట్ కాలేదేమో. సినిమా స్క్రిప్ట్ విషయంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య అభిప్రాయ భేదాల నుండి మొదలై మహేష్ బాబు షూట్ కి బ్రేక్ ఇచ్చి రెండుసార్లు వెకేషన్ కి వెళ్లి రావటం, పవన్ కళ్యాణ్ సినిమాల వ్యవహారాల్లో గురూజీ బిజీ అవ్వటంతో షూటింగ్ డిలే అవ్వడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అనుకున్న సమయంలో సీనియర్ ఆర్టిస్ట్ ల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం, హీరోయిన్ పూజా హెగ్డేను సినిమా నుండి తప్పించటంతో మళ్ళీ సినిమా మొదటికి వచ్చింది. ఆ తర్వాత స్టంట్ మాస్టర్ ని చేంజ్ చేయటం, నిన్నటికి నిన్న సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ని తప్పించి రవి కె చంద్రన్ ను తీసుకోవటంతో గుంటూరు కారం సినిమా సోషల్ మీడియాలో ట్రోల్ కంటెంట్ గా మారిపోయింది.

తాజాగా గుంటూరు కారం సినిమా విషయంలో మరొక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముందు నుండి ప్రచారంలో ఉన్నట్టుగానే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను తప్పించారని టాక్ వినిపిస్తోంది. తమన్ ప్లేస్ లో ఖుషి ఫేమ్ అబ్దుల్ వాహబ్, భీమ్స్ లను తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

- Advertisement -

నాలుగు పాటలు అబ్దుల్ వాహబ్ చేత, రెండు పాటలు భీమ్స్ చేత చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఒకరు మెలోడీస్ కి, మరొకరు మాస్ సాంగ్స్ కి పెట్టింది పేరు కావటం వల్ల సినిమాకి మ్యూజిక్ బ్యాలెన్స్ అవుతుందని, ఇది మంచి డెసిషన్ అని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.

తమన్ ఇచ్చిన ట్యూన్స్ ఒక్కటి కూడా మహేష్ బాబుకి నచ్చలేదని, ఇంతకాలం త్రివిక్రమ్ బలవంతం మీద నెట్టుకొచ్చారని టాక్ వినిపిస్తోంది. తమన్ ‘బ్రో’ సినిమా రీరికార్డింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ నిర్ణయానికి వచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే, గతంలో సినిమా షూటింగ్ విషయంలో ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ ఇప్పుడు సైలెంట్ గా ఉండటం చూస్తుంటే ఈ సినిమా విషయంలో ఏదో తేడా జరుగుతోందని అనుమానం వస్తుంది.

ఒక స్టార్ హీరో సినిమా అంటే షూటింగ్ అప్డేట్స్, మేకింగ్ ఫోటోల లీక్స్ తో వార్తల్లో నిలవాల్సింది పోయి ఇలా రోజుకో వివాదంతో నెట్టింట నవ్వుల పాలవ్వడం విచారకరం. మొత్తానికి ఈ మొత్తం రచ్చకి గురూజీ కారణం అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, వెకేషన్స్ మీద పెట్టిన శ్రద్ధ సినిమా విషయంలో పెట్టట్లేదని మహేష్ బాబును ఇంకో వర్గం ఆరోపిస్తోంది. మరి, సమస్యల సుడిగుండం నుండి గుంటూరు కారం సినిమా బయటపడి రిలీజ్ కి నోచుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు