Kanguva: ఎన్టీఆర్ కి సూర్య చెక్ పెట్టేలా ఉన్నాడు..!

కోలీవుడ్ హీరో సూర్యకి తమిళ్ కంటే టాలీవుడ్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్స్ ని సైతం తలదన్నే పొటెన్షియాలిటీ ఉన్నప్పటికీ సరైన హిట్స్ లేక సూర్య మార్కెట్ సౌత్ కి మాత్రమే పరిమితం అయ్యిందని చెప్పాలి. గజినీ, సెవెంత్ సెన్స్, లాంటి సినిమాలు గనక ఈ టైమ్ లో వచ్చి ఉంటే, సూర్యకి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ పడేవి. ఆ మధ్య రిలీజైన ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ అవి డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల సూర్య కెరీర్ కి ప్లస్ అవ్వలేకపోయాయి.

ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్ప్స్ తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. శతాబ్దాల  వెనక కాలం నాటి బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకోగా, దేవిశ్రీ అందించిన మ్యూజిక్ గ్లిమ్ప్స్ కి మంచి హై ఇచ్చింది. గ్లిమ్ప్స్ లాస్ట్ లో ఒక్క షాట్ లో మాత్రమే కనిపించి ఒకే ఒక్క డైలాగ్ చెప్పిన సూర్య ఒక్క క్లోజప్ షాట్ లోనే రౌద్రం, కరుణ రసాల్ని పలికించిన తీరు అమోఘం అని చెప్పాలి. చాలా కాలం తర్వాత సూర్య పొటెన్షియాలిటీని మ్యాచ్ చేయగలిగే కంటెంట్ ఉన్న సినిమా పడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రెండు భాగాలుగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో అదే టైమ్ కి రిలీజ్ కి సిద్దమవుతున్న ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమాకి కంగువా గట్టి పోటీ ఇస్తుందని అనిపిస్తుంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే కావటం, అటు ఎన్టీఆర్ కి, ఇటు సూర్యకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అవ్వటంతో ఈ సినిమాల మీద అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.

- Advertisement -

ఎన్టీఆర్ దేవర ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కంగువా గ్లిమ్ప్స్ దేవరని డామినేట్ చేసేలాగా ఉందని చెప్పాలి.దేవర సినిమా ద్వారా కామ్ బ్యాక్ ఇవ్వాలన్న కసితో సినిమాను మోస్ట్ వాయిలెంట్ గా ప్లాన్ చేస్తున్న కొరటాల కంగువా ధాటికి తట్టుకోగలిగే రేంజ్ లో దేవరను రూపొందించగలడా అన్న అనుమానం కలుగుతోంది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మరి, 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కి సిద్దమవుతున్న దేవర సినిమాకి కంగువా సినిమా మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Hollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు