Megastar’s BholaShankar: అక్కడ భోళా పరిస్థితి చాలా దారుణం – మెగాస్టార్ కి ఘోర అవమానం..!

Megastar’s BholaShankar

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండే మెగా ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి లేని సినిమా అందరు అనుకున్నట్లే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మినిమమ్ హైప్ కూడా లేకపోవటం ఒక కారణం అయితే, సినిమా రిలీజ్ కి ముందు వాల్తేరు వీరయ్య సినిమా 200డేస్ ఫంక్షన్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యల ఏపీలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మరో కారణం అవ్వటంతో భోళాశంకర్ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. రెండో రోజు పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని, ఆక్యుపెన్సీ బాగా పడిపోయిందని టాక్ వినిపిస్తోంది.

ఇక యూఎస్ లో అయితే, రీఎంట్రీ తర్వాత ఏ చిరంజీవి సినిమాకు లేనంత దారుణంగా కలెక్షన్స్ ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ నుండే యూఎస్ లో డల్ గా ఉన్న భోళాశంకర్ ప్రీమియర్స్ ద్వారా కేవలం 303k డాలర్స్ మాత్రమే వసూలు చేసింది. వాల్తేరు వీరయ్య సినిమాకు ప్రీమియర్స్ ద్వారా 650k డాలర్స్ కలెక్షన్స్ రాగా ఫుల్ రన్ లో 2మిలియన్ మైల్ స్టోన్ ని క్రాస్ చేసింది. వాల్తేరు వీరయ్య సినిమా ప్రీమియర్స్ కలెక్షన్స్ లో సగం మాత్రమే రాబట్టిన భోళాశంకర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. భోలకి మొదటి రోజు కేవలం 85k డాలర్ల వసూళ్లు మాత్రమే దక్కాయి.

ఈ రకమైన వసూళ్లతో 1మిలియన్ మార్క్ అందుకోవటం అసాధ్యమనే చెప్పాలి. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఆచార్య సినిమా ఫుల్ రన్ లో 985k డాలర్స్ కలెక్ట్ చేయగా భోళా శంకర్ కనీసం ఆ కలెక్షన్స్ అయినా క్రాస్ చేస్తుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. మొత్తానికి ఆచార్య లాంటి నైట్ మేర్ నుండి వాల్తేరు వీరయ్య సినిమాతో బయటపడ్డ మెగాఫ్యాన్స్ కి భోళాశంకర్ మరో నైట్ మేర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు