Pan India Star Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ కు సర్జరీ ?

Pan India Star Prabhas

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వాన్ని అందుపుచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. చత్రపతి, బాహుబలి ఇలాంటి సినిమాలు చేసి తన సత్తా చాటాడు ప్రభాస్. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాల చొప్పున రిలీజ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఏడాది ఇప్పటికే ఆది పురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ప్రభాస్. ఇది ఇలా ఉండగా తాజాగా ప్రభాస్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మోకాలి సర్జరీ చేయించుకున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం ప్రభాస్ సలార్ మరియు కల్కి సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాల షూటింగ్ పూర్తికాగానే మొగాలి సర్జరీ చేయించుకుంటారని తెలియడంతో… ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ తన ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని… మోకాలికి గాయం ఉన్నప్పటికీ డేడికేషన్ తో సినిమాలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. కొన్ని రోజులు సినిమాలు ఆపేసి ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని కోరుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు