Operation valentine: స్పీడ్ పెంచిన వరుణ్ తేజ్

Varun tej latest movie update

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆయన చేస్తున్న సినిమాల్లో స్పీడ్ పెంచాడు. గతకొద్ది కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేక డీలా పడిపోయిన వరుణ్ తేజ్ ఈ ఏడాది రెండు సినిమాల రిలీజ్ లతో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయ్యాడు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున సినిమా ఆగస్ట్ 25న రిలీజ్ అవబోతుండగా.. ఇక ఈ సినిమా రిలీజైన కేవలం నాలుగు నెలల గ్యాప్ లోనే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ లపై వరుణ్ తేజ్ శక్తి ప్రతాప్ సింగ్ అనే బాలీవుడ్ దర్శకుడి డైరెక్షన్ లో హిందీ, తెలుగు బై లాంగ్వేజికల్ సినిమా చేస్తున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

గతకొద్ది రోజుల క్రితమే షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా టైటిల్ ను కాసేపటి క్రితం మూవీ టీం ఎనౌన్స్ చేసారు. “ఆపరేషన్ వాలెంటైన్” అనే ఆసక్తికర టైటిల్ ఈ సినిమాకు పెట్టినట్టు మూవీ టీం పోస్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 8 రిలీజ్ చేయబోతున్నట్టు సినిమా రిలీజ్ డేట్ ను పోస్టర్ లో మెన్షన్ చేసారు.

- Advertisement -

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా మానుషి చిల్లర్ నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాల రిలీజ్ కు రెడీ గా ఉండగానే అంతలోనే వరుణ్ తేజ్ పలాస ఫేం కరుణ కుమార్ తో మట్కా అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇటీవలనే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ అవబోతుంది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న మెగా ఫ్యామిలీ హీరోల్లో వరుణ్ తేజ్ టాప్ గేర్ లో వెళ్తున్నట్టు తెలుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు