Varun tej: గాండీవధారి అర్జునుడు ఎప్పుడు వస్తున్నడంటే..?

వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా గాండీవధారి అర్జున జోరు మొదలవబోతుంది. గతకొద్ది రోజులుగా నిర్విరామంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో ఇక సినిమా ప్రమోషన్స్ గట్టిగ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ వస్తోన్న ఈ సినిమాను బివిఎస్సెన్ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా నటిస్తుంది.

ఇటీవలనే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమాయణంకు ఫుల్ స్టాప్ పెట్టి ఆమెతో నిశ్చితార్థం వరుణ్ తేజ, తొందర్లోనే పెళ్లి పీటలేక్కబోతున్న కూడా సినిమాలు చేయడం మాత్రం మానడం లేదు. అటు లావణ్య త్రిపాఠి, ఇటు వరుణ్ తేజ్ ఎవరి సినిమాలతో వాళ్ళు షూటింగ్ లలో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడితో ఇండియన్ నేవి నేపథ్యంలో ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక వరుణ్- లావణ్య ల పెళ్లి తేదీ ఖరారు కానుంది.

ఇక గాండీవధారి అర్జున సినిమా విషయానికొస్తే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్స్ ఇదివరకే రిలీజై, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా, రేపు ఉదయం ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే మొదటగా తక్కువ నిడివితో మొదట ప్రి టీజర్ రిలీజ్ చేసి, ఆ తరువాత టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు టాక్. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు