Anushka: అవుట్ డేటెడ్ శెట్టి పొలిశెట్టి- యూవీ క్రియేషన్స్ ఖాతాలో మరో ఫ్లాప్ లోడింగ్ ?

యూవీ క్రియేషన్స్ పరిస్థితి చూస్తూనే జాలి పడక తప్పేటట్టు లేదు. గత కొద్దీ రోజులుగా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒకటిని మించి ఇంకోటి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. సినిమా క్వాలిటీ విషయంలో వెనుకాడకుండ బడ్జెట్ కోసం అస్సలు ఆలోచించకుండా ఎంతైనా ఖర్చుపెట్టే యూవీ క్రియేషన్స్ ఈ మధ్య కాలంలో చేస్తున్న సినిమాలేవీ ప్రేక్షకులను అలరించడం లేదు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమా తరువాత మళ్ళీ ఆ రేంజ్ లాభాలు తెచ్చిన సినిమా యూవీ నుంచి ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి.

ఇక లేటెస్ట్ గా యూవీ క్రియేషన్స్ నుంచి రాబోతున్న మరో సినిమా మిస్ శెట్టి  మిస్టర్ పొలిశెట్టి  యంగ్ టాలెంటెడ్ నవీన్ పోలిశెట్టి హీరోగా, అనుష్క హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమా అప్పుడెప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా,కొన్ని కారణాల వల్ల ఇప్పుడిప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

అయితే సినిమా రిలీజ్ దగ్గరికి వస్తుండటంతో మిస్ శెట్టి  మిస్టర్ పొలిశెట్టి  ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబందించిన పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్ అయితే ఇప్పటి వరకు రిలీజైన పాటలు, ప్రోమోలు, టీజర్ ఏది కూడా ప్రేక్షకులను థియేటర్ కు తీసుకొచ్చేలా కనబడటం లేదు. విజువల్స్ అన్ని క్లాస్ గా, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఉన్న కూడా కంటెంట్ మాత్రం వీక్ గా ఉన్నట్టే తెలుస్తోంది. అవుట్ డేటెడ్ కథకు కాస్త మోడరన్ టచ్ ఇచ్చినట్టే స్పష్టమవుతుంది. మహేష్ బాబు పి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాని నవీన్ పొలిశెట్టి యాక్టింగ్, అనుష్క గ్లామర్ తప్ప ఇంకేదీ కాపాడేలా లేదు. దీన్ని బట్టి చూస్తే యూవీ క్రియేషన్స్ కు ఖాతాలో మరో ఫ్లాప్ లోడింగ్ అయినట్టే ఉంది. ఇక నుంచైనా యూవీ క్రియేషన్స్ కథల విషయంలో జాగ్రత్త పాటించకపోతే తొందర్లోనే మూత పడటం ఖాయం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు