Manadesham: స్వాతంత్రోద్యమ నేపథ్యంలో మొట్టమొదటి తెలుగు చిత్రం..

Manadesam: Telugu’s first independence film

భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని రకాల సినిమాలు తీయగలిగే ఇండస్ట్రీగా టాలీవుడ్ కి మంచి పేరుంది. అయితే స్వాతంత్రోద్యమ చిత్రాలు, దేశభక్తి చిత్రాలు మాత్రం కొంచెం తక్కువగానే రూపొందాయి. అయితే ఉన్న వాటిలో మాత్రం చెప్పుకోదగిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అయితే స్వాతంత్రోద్యమ నేపథ్యంలో వచ్చిన మొట్ట మొదటి తెలుగు చిత్రం “మనదేశం”. ఆగష్టు15 ఇండిపెండెన్స్ డే రాబోతున్న సందర్భంగా ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలను చర్చిద్దాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 1932 నుండే సినిమాలు రూపొందుతున్నా వాటిలో పౌరాణికాలు, భక్తిరసాలు, జానపదాలు, రాజ్యమేలుతున్న రోజులవి. అడపా దడపా కొన్ని సాంఘీక చిత్రాలు కూడా వచ్చేవి. కానీ అప్పటివరకు దేశభక్తి నేపథ్యంలో ఒక్క సినిమా కూడా రాలేదు. అలాంటి సమయంలో తొలి తరం తెలుగు నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి, ఆమె భర్త మీర్జాపురం రాజాతో కలిసి మనదేశం చిత్రాన్ని నటించి నిర్మించింది.

శరత్ చంద్ర రాసిన బెంగాలీ నవల “విప్రదాస్” ఆధారంగా తీసిన ఈ చిత్రంలో నారాయణరావు, చిత్తూరు నాగయ్య ప్రధానపాత్రల్లో నటించగా, కృష్ణవేణి హీరోయిన్ గా నటించింది. ఇక ఎన్టీ రామారావు ఈ సినిమాలో ఒక చిన్న పోలీస్ పాత్ర వేశారు. ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా ఇదే. వీరితో పాటు రేలంగి కూడా నటించారు. l.v ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1949 నవంబర్24న విడుదలైంది.

- Advertisement -

ఈ సినిమాలో స్వాతంత్రోద్యమంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తాడు హీరో. ఇక ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ ఉద్యమ కారుల కష్టాలను చూసి చలించిపోయిన హీరోయిన్ ఆమె తన వంతు పాత్రగా మహిళలతో కలిసి విప్లవం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో హీరో హీరోయిన్లు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో దేశ స్వాతంత్య్రానికి ఏ రకంగా కృషి చేశారు. చివరకి వాళ్ళ కల నెరవేరిందా అన్నదే కథ.

చిన్న కథే అయినప్పటికీ ఆనాటి స్వాతంత్ర ఉద్యమకాలం పరిస్థితులను కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఇప్పుడు ఈ సినిమా చూసే వాళ్లకి పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చేమో గాని. ఆరోజుల్లో మాత్రం ఎంతో మందిని కదిలించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక రెండేళ్లకు ఈ సినిమా వచ్చింది. ఇక మనదేశం చిత్రం విడుదలైన తర్వాత పూర్తి స్థాయి స్వాతంత్రోద్యమ చిత్రం మళ్ళీ రావడానికి దాదాపు 20ఏళ్ళు పట్టింది.

ఆనాటి చాలా చిత్రాల్లో దేశభక్తి పాటలున్నాయి గాని, సినిమాలు రాలేదు. బొబ్బిలి యుద్ధం, పదండి ముందుకు, వెలుగు నీడలు వంటి చిత్రాల్లో పాక్షికంగా దేశభక్తి గురించి చెప్పారు, కాని పూర్తి స్థాయిలో వచ్చిన స్వాతంత్రోద్యమ చిత్రం మాత్రం అల్లూరి సీతారామ రాజు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు