Varuntej: “గాండీవధారుడికి” ఇచ్చిన మిషన్ ఏంటి?

Varun Tej Gandhivadhari Arjuna Trailer

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి రాబోతున్న సినిమా “గాండీవధారి అర్జున”. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వరా సినీచిత్ర బ్యానర్ లో భోగవల్లి ప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక అండర్ కవర్ స్పై ఏజెంట్ గా నటించగా, సాక్షి ఐఏఎస్ గా నటించింది. ఇప్పటికీ రిలీజ్ అయిన టీజర్ అంచనాలను రెట్టింపు చేయగా, తాజాగా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.

టీజర్ తో రొటీన్ జోన్ లో వెళ్తున్నాడన్న విమర్శకులకు ట్రైలర్ తో ప్రవీణ్ సత్తారు ఆన్సర్ ఇచ్చాడని చెప్పాలి. ట్రైలర్ ని గమనించగా, ఈ సినిమాలో నాజర్ అలియాస్ ఆదిత్య రాజ్ బహద్దూర్ ఒక ఇండియన్ రాయబారి ఆఫీసర్ గా ఇంగ్లాండ్ లో పనిచేస్తాడు. ఒకానొక సమయంలో అతనిపై ఎట్టాక్ ప్రయత్నం జరుగుంతుంది. ఎలాగో బయటపడిన ఆయన తన వల్ల కానీ పనిని అర్జున్ కుమార్ అనే వ్యక్తికి అప్పగిస్తాడు. ఆ మిషన్ తో ఏమాత్రం సంబంధం లేని అర్జున్ ఆ మిషన్ పని పూర్తి చేస్తాడా లేదా అనేది కథ.

- Advertisement -

ఇక ట్రైలర్ లో వరుణ్ తేజ్ చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉండి ఆకట్టుకున్నాడు. ఇంకా తాను చేసిన ఫైట్లు, రిస్కీ స్టంట్స్ చూసాక ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. ఇక ట్రైలర్ కట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అవబోతుందని ట్రైలర్ లో బీజీఎమ్ ని బట్టి చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. సినిమాని దాదాపు 90 శాతం ఫారిన్ లోనే తీసారని తెలుస్తుంది.

ఇక సినిమాలో విదేశీ నటులు కూడా చాలామంది ఉండడం విశేషం. ఈ సినిమాలో నాజర్, విమల రామన్, వినయ్ రాయ్, అభినవ్ గౌతమ్, రవి వర్మ, నరైన్, రోషిణి ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఇక ఆగస్టు 25న గాండీవధారి అర్జున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు