Gandeevadhaari Arjuna: ఈ సినిమాలో సాక్షి IAS అంట!

Gandhivadhari Arjuna trailer event:

టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతున్న సినిమా “గాండీవధారి అర్జున”. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించగా ఏజెంట్ భామ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా ట్రైలర్ విడుదలయింది. ఈ ట్రైలర్ టీజర్ ని మంచి చాలా రిచ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొనగా అక్కడ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానమిచ్చింది.

అలాగే హీరోయిన్ సాక్షి వైద్యకి కూడా ఈ సినిమాలో ఎలాంటి రోల్ చేసారని ప్రశ్న అడగడం జరిగింది. దానికి సాక్షిరిప్లై ఇస్తూ ఈ సినిమాలో తాను ఒక IAS ఆఫీసర్ రోల్ ప్లే చేసానని చెప్పింది. ఇక తనకు ఈ సినిమాలో ఫైట్లు అలాంటి సీన్లు పెట్టలేదని, కానీ తన రోల్ మాత్రం సినిమాలో ఇంట్రెస్టింగ్ మలుపు తిప్పుతుందని సమాధానం ఇచ్చింది. అయితే చాలా మంది నెటిజన్లు ఈ సినిమాలో సాక్షి ఏజెంట్ టీమ్ లో ఒక మెంబర్ గా ఉంటుందని అనుకున్నారు. అయితే అది నిజం కాదని సాక్షి అన్న మాటల్ని బట్టి తెలిసిపోయింది.

ఇక సాక్షి తన తొలి సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఆ సినిమాలో పాటలకి మాత్రమే పరిమితమయ్యే రోల్ ఇచ్చారని తెలిసిందే. కానీ ఈ సినిమాలో తనకి మంచి పెరఫార్మన్స్ ఉన్న రోల్ ఇచ్చారని అంటుంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది, సాక్షి వైద్య కి ఈ సినిమాలో ఎంత ప్రాధాన్యత ఇచ్చారో.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు