RAPO’s Skandha: స్కంద తర్వాత బోయపాటికి గ్యాప్ తప్పదా..?

ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటి శ్రీనివాస్ ప్రస్తుతం హీరో రామ్ తో చేస్తున్న స్కంద సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తైన ఈ సినిమాను త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి సెప్టెంబర్ 15న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన గ్లిమ్ప్స్, సాంగ్ రిలీజయ్యి ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత హీరో రామ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో చేయబోయే డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే, బోయపాటి మాత్రం ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు.

ఆ మధ్య బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నాడని వార్తలొచ్చినప్పటికీ తర్వాత ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అంతే కాకుండా బాలకృష్ణతో అఖండ సినిమాకి సీక్వెల్ ఉంటుందని, 2024 ఎలక్షన్స్ టార్గెట్ గా ఆ సినిమా రిలీజ్ అవుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి సినిమాతో సహా డైరెక్టర్ బాబీతో కూడా మరో సినిమా అనౌన్స్ చేయటంతో ఇప్పట్లో బోయపాటి, బాలయ్య ల కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం లేదు.

అఖండ సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న బోయపాటి తన నెక్స్ట్ సినిమాను కూడా స్టార్ హీరోతో పాన్ వైడ్ ప్లాన్ చేయాలని భావిస్తున్నాడని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల దగ్గర నుండి టైర్2 హీరోల వరకు అందరూ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బోయపాటి స్టార్ హీరోస్ కోసం వెయిట్ చేసి కొంత గ్యాప్ తీసుకుంటాడా లేక ఆ లోపు చిన్న హీరోలతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తాడా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు