Mega Princess: మనవరాలిపై ప్రేమతో మెగాస్టార్ కీలక నిర్ణయం…!

Mega Princess

రామ్ చరణ్ – ఉపాసన గారాల బట్టి క్లిన్ కారా కొణిదెల పుట్టగానే తన కుటుంబంలో సంతోషాలను తెచ్చిపెట్టింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా మెగా అభిమానులకు, తన కుటుంబ సభ్యులకు క్లిన్ కారా రాకతో పండగ వాతావరణం నెలకొంది. ఇక మెగా వారసురాలు పుట్టగానే చిరంజీవికి ఎంతో కలిసి వచ్చిందట. తన జాతకం చాలా అద్భుతంగా ఉందని వారు తెగ సంబరపడిపోతున్నారు.
ఇక క్లీన్ కారా పుట్టినప్పటినుంచి ఎంతోమంది తనకి బహుమతులను పంపిస్తున్నారు. చాలామంది బంగారు బహుమతులను పంపించారు. చాలామంది చాలా బహుమతులను పంపించారు. కానీ చిరంజీవి వద్దనుండి తన మనవరాలికి ఎలాంటి బహుమతి వచ్చిందా అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. తన గారాల మనవరాలికి చిరంజీవి ఎలాంటి బహుమతి ఇచ్చారు అని ప్రేక్షకులు అభిమానులు తెగ చర్చ్ చేస్తున్నారు.
అయితే క్లీన్ కారా తన తాత, నానమ్మ వద్ద నుండి ఓ బంగారు కానుక వచ్చిందట. రామ్ చరణ్ – ఉపాసన బిడ్డతో ఆడుకోవాలని, ఎత్తుకోవాలని చిరంజీవి ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నారు.అలాంటి కోరిక క్లిన్ కారా ద్వారా తీరిపోయింది. అలాంటి మనవరాలికి చిరు బహుమతి ఇవ్వకుండా ఉంటారా…? తన మనవరాలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చిరంజీవి – సురేఖ కలిసి తన మనవరాలి కోసం అభయాంజనేయ స్వామి ముద్ర ఉన్న ఓ బంగారు డాలర్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆంజనేయస్వామి వద్ద ఆ డాలర్ ని పెట్టి ప్రత్యేకంగా పూజలు చేయించి మరి ఈ డాలర్ ని పాప చేతిలో పెట్టారట. దీని ద్వారా వారి ఇంటిదైవం అయిన ఆంజనేయ స్వామి తన మనవరానికి రక్షగా ఉంటారని భావించి ఈ గిఫ్ట్ ని ఇచ్చారట చిరంజీవి – సురేఖ.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు