Megastar’s Bholaa Shankar: జైలర్ స్పీడ్ తట్టుకోవటం కష్టమే..!

Megastar’s Bholaa Shankar

ఒకరు మెగాస్టార్, ఇంకొకరు సూపర్ స్టార్, ఒకరు టాలీవుడ్ కి ఐకాన్, ఇంకొకరు కోలీవుడ్ కి ఐకాన్. ఈ ప్రస్తావన ఎవరి గురించన్నది ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. జైలర్ సినిమాతో వచ్చిన రజినీకాంత్, భోళాశంకర్ సినిమాతో ఆగస్టు 11న రానున్న చిరంజీవి మధ్య నెలకొన్న పోటీలో ముందుగా జైలర్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో భోళాశంకర్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతం అవుతున్న సూపర్ స్టార్ కి బ్లాక్ బస్టర్ అందగా, ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ భోళాశంకర్ సినిమాతో ఆ పరంపరను కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అయితే, భోళాశంకర్ రొటీన్ మాస్ మసాలా సినిమాకి రీమేక్ కావటం, డిజాస్టర్ ట్రాక్ ఉన్న మెహర్ రమేష్ డైరెక్టర్ కావటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో కూడా పెద్దగా ఆసక్తి లేదు. ఈ నేపథ్యంలో జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో భోళాశంకర్ కి గట్టి పోటీ ఇస్తుందన్న కామెంట్స్ వస్తున్నాయి. మొదటి నుండి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన జైలర్ సినిమా రిలీజ్ కి ముందే యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ దాటగా, భోళాశంకర్ మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేకపోయింది.

మెగాస్టార్ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం బహుశా చిరంజీవి కెరీర్లోనే ఇదే ప్రధమం అనుకోవచ్చు. బజ్ లేకపోవటానికి తోడుగా ఏపీలో టికెట్ రేట్ పెంచుకునేందుకు పర్మిషన్ లేకపోవటం, ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య 200డేస్ ఫంక్షన్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యల వల్ల ఏపీలో ప్రతికూల పరిస్థితి నెలకొనటం భోళాశంకర్ కి మైనస్ పాయింట్ అనే చెప్పాలి. మరి, రిలీజ్ ముందు వరకు కొంచెం కూడా హైప్ క్రియేట్ చేయలేకపోయిన భోళాశంకర్, జైలర్ స్పీడ్ ని తట్టుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు