Independence Week: దేశభక్తి నింపిన తెలుగు పాటలు..!

Independence Week Special

మాట కంటే పాట ఎక్కువ ప్రభావం చూపుతుంది అన్నది కాదనలేని సత్యం. స్వతంత్ర పోరాటం దగ్గర నుండి ఇటు దేశంలో, అటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాల్లో ముఖ్య పాత్ర పోషించింది పాట. స్వతంత్ర దినోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో తెలుగు సినిమాల్లో దేశభక్తి నింపిన పాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

మేమే ఇండియన్స్ ( ఖడ్గం ):

రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో రూపొందిన ఖడ్గం సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేశభక్తి  ప్రధానంగా రూపొందిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన మేమే ఇండియన్స్ అనే సాంగ్ తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ఇప్పటికీ స్కూల్స్ కాలేజెస్ లో ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ లో కచ్చితంగా ఈ పాట వినిపిస్తూ ఉంటుంది.

- Advertisement -

దేశం మనదే, తేజం మనదే ( జై ):

దర్శకుడు తేజ కాంబినేషన్లో హీరో నవదీప్ తెలుగు తెరకు పరిచయం అయిన సినిమా జై. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో దేశం మనదే, తేజం మనదే అంటూ సాగే ఈ పాట ప్రతి ఇండిపెండెన్స్ డే కి వినిపిస్తూనే ఉంటుంది. సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా, ఈ పాట సినిమాకి మంచి గుర్తింపు తెచ్చింది.

వందే మాతరం ( బాబీ ):

మహేష్ బాబు, ఆర్తీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన బాబీ సినిమాలో మణిశర్మ సంగీతం అందించిన వందే మాతరం సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోవటమే కాకుండా ఇండిపెండెన్స్ ప్రతి ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ లో వినిపిస్తూ మనలో దేశభక్తి స్ఫూర్తిని నింపుతూనే ఉంది. బాబీ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయినప్పటికీ ఈ పాట మాత్రం మంచి గుర్తింపు పొందింది.

వినరా వినరా ( రోజా ):

మణిరత్నం డైరెక్షన్లో అరవింద్ స్వామి, మధుబాల జంటగా నటించిన రోజా సినిమా 1992లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టెర్రరిజం బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ లవ్ స్టోరీలో లవ్ సాంగ్స్ తో పాటు వినరా వినరా అనే దేశభక్తి గీతం కూడా మంచి ఆదరణ పొందింది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాలో సాంగ్స్ తెలుగులో కూడా క్లాసిక్స్ గా నిలిచాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రతి ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్లో గుర్తుకు వచ్చే సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుంది.

దేశమంటే (ఝుమ్మంది నాదం ):

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు డైరెక్షన్లో మనోజ్, తాప్సి జంటగా నటించిన సినిమా ఝుమ్మంది నాదం. మ్యూజిక్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఇందులో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్లైమాక్స్ లో వచ్చే దేశమంటే సాంగ్ ఇండిపెండెన్స్ డే స్పెషల్స్ లో ఒకటిగా నిలుస్తుంది. కీరవాణి సంగీతంతో ఎస్పీబీ స్వరంలో రూపొందిన ఈ సాంగ్ దేశభక్తితో పాటు సొసైటీకి మంచి మెసేజ్ కూడా ఇచ్చింది.

ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో దేశభక్తి ప్రధానంగా రూపొందిన సాంగ్స్ చాలానే ఉన్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు