Super Star’s Jailer: మిల్కీ బ్యూటీని ఐటమ్ గర్ల్ చేసేసారుగా..!

Super Star’s Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ), నెల్సన్ దిలీప్ కాంబినేషన్లో రూపొందిన జైలర్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోవటంతో నిరాశతో ఉన్న రజనీ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫుల్ మీల్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో వింటేజ్ స్టైల్ లో రజినీకాంత్ ను ప్రెజెంట్ చేసిన నెల్సన్ కి ప్రశంసలు అందుతున్నాయి. అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇదిలా ఉండగా ‘కావాలయ్యా’ సాంగ్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా క్యారెక్టర్ మాత్రం నిరాశపరిచిందనే చెప్పాలి. ఐటమ్ సాంగ్ బాగున్నప్పటికీ తమన్నా ట్రాక్ 10నిముషాలు కూడా లేకపోవటం, అది కూడా ఐటమ్ సాంగ్ కోసమే అన్నట్టు ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇటీవల లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న తమన్నా జైలర్ సినిమాలో ఐటమ్ సాంగ్ కి మాత్రమే పరిమితం కావటం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది. గత కొంత కాలంగా సరైన హిట్ లేని తమన్నాకు జైలర్, భోళాశంకర్ వంటి పెద్ద సినిమాల్లో ఆఫర్ వస్తున్న తరుణంలో ఇలా ఐటమ్ సాంగ్స్ కి మాత్రమే పరిమితమయ్యే రోల్స్ చేయటం వల్ల కెరీర్ పై ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది.

మొత్తానికి స్పెషల్ సాంగ్ తో జైలర్ పై హైప్ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఉండుంటే సినిమాకి ప్లస్ అయ్యుండేది. మొదటి నుండి పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకొని అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న జైలర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న హిట్ ఇచ్చిందనే చెప్పాలి. మరి, మెగాస్టార్ సినిమాకి పోటీగా వచ్చిన జైలర్ ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు