Mahesh’s Pokiri: మహేష్ బాబు ‘పోకిరి’.. చిరు హిట్ సినిమాకు కాపీయా..?

Mahesh’s Pokiri

పోకిరి.. టాలీవుడ్ లో ఈ చిత్రం ఓ సంచలనం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. గోవా బ్యూటీ ఇలియానా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మూత మోగించింది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం 200 సెంటర్లలో వంద రోజులు ఆడి ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర లిఖించింది. పండుగాడి పర్ఫార్మెన్స్ కి కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ సినిమాతోనే ఇలియానా టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2006 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం దెబ్బతో ఇండస్ట్రీ పాత రికార్డులు అన్నీ చెరిగిపోయాయి.

అయితే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ హిట్ సినిమా స్ఫూర్తితో తెరకెక్కించారని ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు. ఆ సినిమా మరేదో కాదు.. 1989లో చిరంజీవి – భానుప్రియ జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టేట్ రౌడీ. అయితే స్టేట్ రౌడీ సినిమా కూడా 1975లో వచ్చిన బాలీవుడ్ యాక్షన్ క్రైమ్ మూవీ ‘దీవార్’ కాపీ అని అంటుంటారు. ఈ రెండు చిత్రాలలోని పాత్రలు, కథాంశం, సన్నివేశాలు దాదాపు పోలిఉంటాయి.

దివార్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, శశికపూర్ నటించారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ ఒక డాన్ కాగా.. శశి కపూర్ ఒక పోలీస్ ఆఫీసర్. స్టేట్ రౌడీ సినిమాలో ఈ రెండు పాత్రలను చిరంజీవి పోషించారు. రౌడీలను ఎలిమినేట్ చేసే రౌడీ కాళీ చరణ్ గానే కాకుండా.. నాగమణి వద్ద పనిచేస్తున్న పోలీస్ ఇన్ ఫార్మర్ పృథ్వి అని చివర్లో తెలుస్తోంది. అయితే పోకిరి సినిమాలో మహేష్ బాబు కూడా మొదట రౌడీగా కనిపిస్తాడు. ఆ తరువాత పోలీస్ ఆఫీసర్ గా అతని పాత్రని రివిల్ చేస్తారు. ఈ రెండు సినిమాలలోను ఒక గ్యాంగ్ స్టార్ గా ఉండే కథానాయకుడు కనిపిస్తాడు. అయితే పోకిరి మోడర్న్ వరల్డ్ లో సెట్ చేయగా.. స్టేట్ రౌడీ కాస్త పాతతరం అన్నమాట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు