SuperStar’s Jailer: రజినీ రెమ్యూనరేషన్ కంటే ఆ హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎక్కువా..?

ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా సూపర్ స్టార్ ఎవరంటే టక్కున చెప్పే పేరు రజనీకాంత్. ఏజ్ బార్ అయినా యంగ్ హీరోలకు పోటీనిస్తూ సినిమాలు తీస్తున్నాడు తలైవా. 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా నటిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ జైలర్ అనే సినిమాతో ఆగస్ట్ 10 తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో రజనీకి జోడీగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించింది. అయితే ఈ సినిమా కోసం రజనీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ.110 కోట్ల భారీ మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారట. సీనియర్ స్టార్ హీరోలలో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రజిని సరికొత్తగా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనినిబట్టి రజనీకాంత్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత రేంజ్ ఉన్న రజనీకాంత్ కంటే ఓ హీరోయిన్ కే ఎక్కువ పారితోషికం ఇచ్చారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..? కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ 1976లో బాలచందర్ దర్శకత్వంలో మూండ్రు ముడిచ్చు అనే సినిమా చేశారు.

ఈ చిత్రం అంతకుముందు తెలుగులో వచ్చిన ఓ సీత అనే సినిమాకు రీమేక్. ఈ మూవీలో నటించినందుకు రజనీకాంత్ కి కేవలం 2 వేల రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చారట. కానీ అదే సినిమాలో నటించిన అందాలతార శ్రీదేవికి మాత్రం 5 వేల రెమ్యూనరేషన్ ఇచ్చారట. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కమల్ హసన్ కి 30 వేలు ఇచ్చారట. ఎందుకంటే అప్పటికే రజనీకాంత్ కంటే కమల్ హాసన్ ఫేమస్. ఏది ఏమైనా ఆ కాలంలో రజనీకాంత్ కంటే శ్రీదేవి డబుల్ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఆశ్చర్యపరిచే విషయం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు