Megastar’s Bholaa Shankar: మెగాస్టార్ కెరీర్లోనే ఇది ఫస్ట్ టైమ్ ఏమో..!

Megastar’s Bholaa Shankar

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ చిరుకి చెల్లెలి క్యారెక్టర్లో నటించింది. అయితే, రొటీన్ మాస్ మసాలా మూవీకి రీమేక్ కావటం, డిజాస్టర్ ట్రాక్ ఉన్న మెహర్ రమేష్ కావటంతో ఈ సినిమాపై పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. దీనికి తోడు టీజర్ మొదలుకొని, ట్రైలర్ సాంగ్స్ వరకు ఏ ఒక్కటి కూడా సినిమాపై ఆసక్తి పెంచలేకపోయాయి. ఇదిలా ఉండగా భోళాశంకర్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో చాలా వెనుకబడింది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిరంజీవి సినిమాకి ఇంత నెగిటివ్ బజ్ ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరో పక్క సూపర్ స్టార్ రజోజనీకాంత్ నటించిన జైలర్ సినిమా మొదటి నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రిలీజ్ అయ్యాక డీసెంట్ టాక్ అందుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడాజోరు చూపించిన జైలర్, రిలీజ్ కి ముందే యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ దాటేసింది. రజినీకాంత్ కి ఇటీవల సరైన హిట్ లేకపోయినప్పటికీ జైలర్ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించటం విశేషం అని చెప్పాలి.

చిరంజీవి సినిమా అంటే రిలీజ్ కి ముందు నుండే ఫ్యాన్స్ కోలాహలం, అడ్వాన్స్ బుకింగ్స్ జోరుతో ఒక రేంజ్ లో హడావిడి ఉండేది. ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి బిన్నంగా ఉంది. భోళాశంకర్ సినిమాకి మినిమమ్ బజ్ కూడా లేకపోవటం వల్ల యూఎస్ లో జైలర్ కి నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోవటంతో మెగాఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది. మరి, సినిమా రిలీజ్ అయ్యాక అయినా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని నిలబడుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు