Megastar’s Bholaa Shankar: ఆ విషయంలో భోళా రాంగ్ స్టెప్ వేస్తున్నాడా..?

Megastar’s Bholaa Shankar

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 10న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా నటించింది. రీమేక్ సినిమా కావటం ఒక కారణమైతే, డిజాస్టర్ ట్రాక్ ఉన్న మెహర్ రమేష్ డైరెక్టర్ కావడం మరో కారణంగా ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో కూడా పెద్దగా ఆసక్తి లేదు. దీనికి తోడు సినిమాకు సంబందించిన టీజర్ మొదలుకొని ట్రైలర్ సహా ఇప్పటికి దాకా విడుదలైన సాంగ్స్ వరకు ఏ ఒక్కటి కూడా సినిమాపై మినిమమ్ హైప్ కూడా క్రియేట్ చేయలేకపోయాయి.
సినిమా మీద హైప్ ఏ మాత్రం లేకపోవటం కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ సైతం ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల యుఎస్ లో కూడా రజోజనీకాంత్ జైలర్ సినిమా కంటే వెనుకబడింది భోళాశంకర్. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ పెంచమని విజ్ఞప్తి చేసి రిస్క్ చేస్తోంది సినిమా యూనిట్. ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్ 177 గా ఉండగా సింగిల్ స్క్రీన్స్ లో 148 గా ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ పై 25రూపాయల హైక్ కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సినిమా యూనిట్.
బయ్యర్లు త్వరగా రికవరీ స్టేజ్ కి చేరుకోవాలనే ప్లాన్ ప్రకారమే సినిమా యూనిట్ ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అయితే, సినిమాకి డీసెంట్ వస్తే ఓకే గానీ, టాక్ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా కూడా సినిమాకు గట్టి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. భోళాశంకర్ మేకర్స్ చేసిన రిక్వెస్ట్ కి రేపు సాయంత్రం లోగా ప్రభుత్వం నుండి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భోళాశంకర్ వేసిన స్టెప్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు