Mega Princess: చిరంజీవి మనవరాలు “క్లింకార” కి దిష్టి తీసినందుకు అన్ని లక్షలా..!

Mega Princess

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతుల పెళ్ళై 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. మెగా ఇంట్లోకి మూడో తరం వారసురాలు అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్న విషయం తెలిసిందే. చిన్నారి జూన్ 20వ తేదీన జన్మించింది. ఆ చిన్నారికి క్లిన్ కార కొణిదెల అని నామకరణం కూడా చేశారు. ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనే ఉన్న ఉపాసన అమ్మగా ప్రమోషన్ పొందిన తర్వాత మొదటిసారి తన పుట్టింటికి వెళ్ళింది.

అయితే అక్కడ ఉపాసన తల్లి కామినేని శోభన మనమరాలిని ఇన్వైట్ చేసేందుకు చేసిన పని చూసి చాలామంది షాక్ అవుతున్నారు. మనవరాలి రాక కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేసి మరీ ధూమ్ ధామ్ రేంజ్ లో సెలబ్రేట్ చేసింది శోభన. అంతేకాదు మనవరాలు ఇంట్లోకి వచ్చే ముందు దిష్టి తీసిన పని వాళ్ళకు ఏకంగా 10 లక్షల రూపాయలను బహుమతిగా ఇచ్చిందట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మామూలుగా ఎవరైనా సరే దిష్టి తీసినందుకు వంద లేదా వెయ్యి రూపాయలు ఇస్తారు. కానీ మనవరాలికి దిష్టి తీసినందుకు శోభన 10 లక్షలు ఇవ్వడంతో పనివాళ్ళు సంబరాలు చేసుకున్నారట. అదేవిధంగా చిన్నారి ఇంట్లోకి అడుగుపెట్టగానే శోభన ఏకంగా చిన్నారి చేతి ముద్రలను తీసుకొని వాటిని బంగారంతో తయారు చేయించి ఒక ఫ్రేమ్ చేయించి భద్రపరిచారట. ఈ విషయాలు తెలిసి మెగా మనవరాలు రేంజ్ అదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్లు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు