Megastar’s Bholaa Shankar: చిరు నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా కీర్తి..?

Megastar’s Bholaa Shankar

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో తమన్నా చిరు సరసన హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ చెల్లలి క్యారెక్టర్లో నటించింది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు. ఇంటర్వ్యూకి యాంకర్ గా ఉన్న కమెడియన్ గెటప్ శీను ‘ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించిన మీరు నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వస్తే చేస్తారా? ‘ అంటూ కీర్తిని ప్రశ్నించాడు.
గెటప్ శీను అడిగిన ప్రశ్నకి ఓకే అంటూ కీర్తి సమాధానం ఇస్తుండగా అంతలోనే చిరు కలుగజేసుకొని ” ఈ సినిమాలో చెల్లిగా నటించినంత మాత్రాన నెక్స్ట్ సినిమాలో చెలిగా, సఖిగా నటించకూడదా” అంటూ తిరిగి ప్రశ్నించారు. అప్పట్లో ఎన్టీఆర్, సావిత్రి కూడా ఒక సినిమాలో అన్న, చెల్లెళ్లుగా నటించి తర్వాత హీరో హీరోయిన్లుగా నటించిన విషయాన్నీ గుర్తు చేశారు.
చిరంజీవి రియాక్షన్ ఫన్ ని జెనరేట్ చేసిన నేపథ్యంలో మెగాస్టార్ నెక్స్ట్ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా చిరు యంగ్ లుక్స్ మైంటైన్ చేస్తూ ఈ తరం హీరోయిన్స్ తో కూడా స్టెప్పుల్లేస్తున్న క్రమంలో ఫ్యాన్స్ ఖుషి అవుతుండగా, ఈ వయసులో డ్యూయెట్స్ అవసరమా అన్న నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి, చిరంజీవి సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందా లేదా వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు