Prabhas’s Kalki 2898 AD: కల్కి రిలీజ్ డేట్ పై నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే..!

Prabhas’s Kalki 2898 AD

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమాకు సంబందించిన గ్లిమ్ప్స్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలు పెంచింది. 2024 సంక్రాంతికి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే సూచనలు కనిపించటం లేదు. మొదట రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమా యూనిట్, గ్లిమ్ప్స్ వీడియోలో రిలీజ్ డేట్ పెట్టకపోవడం వల్ల అభిమానుల్లో అనుమానం మొదలైంది. గ్లిమ్ప్స్ రిలీజ్ సమయంలో దర్శకుడు రాజమౌళి కూడా రిలీజ్ డేట్ పై సెటైరికల్ గా ట్వీట్ చేయటంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది.
ఇటీవల నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో కల్కి రిలీజ్ డేట్ ప్రస్తావన రాగా, దీనిపై క్లారిటీ ఇచ్చాడు. కల్కి సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతోందని, ఈ సినిమాలో వీఎఫెక్స్ కీలక పాత్ర పోషిస్తుందని, షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయినా కూడా వీఎఫెక్స్ పూర్తవ్వటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, కల్కి సంక్రాంతికి రిలీజ్ అవ్వటం కష్టమే అని, 2024 సమ్మర్ నాటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.
తాజాగా నాగ్ అశ్విన్ రిలీజ్ డేట్ పై చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్ లో హోప్స్ పెంచుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యిందని, కొంత భాగమే పెండింగ్ ఉందని చెప్పాడు. ప్రస్తుతం వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తీ చేసే దిశగా తన ఫోకస్ ఉందని చెప్పిన నాగ్ అశ్విన్, షూటింగ్ పూర్తవ్వగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపాడు. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అంటూ వచ్చిన వార్తలతో నిరుత్సాహంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి నాగ్ అశ్విన్ కామెంట్స్ కాస్త ఉరటనిస్తున్నాయి. మరి, ఫ్యాన్స్ సహా నార్మల్ ఆడియెన్స్ సైతం ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యి ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు