KALKI 2898 AD: మారుతి సైలెన్స్ – ఫ్యాన్స్ అటాక్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో Kalki 2898 AD  సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లిమ్ప్స్ ఇటీవలే రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేసింది. ఫస్ట్ లుక్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నాగ్ అశ్విన్, టైటిల్ గ్లిమ్ప్స్ తో అందరి నోళ్లు మూయించాడనే చెప్పాలి. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక నాగ్ అశ్విన్ పై ఫైర్ అయిన ప్రభాస్ అభిమానులు సైతం గ్లిమ్ప్స్ తర్వాత నాగ్ అశ్విన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కల్కి సినిమా గ్లిమ్ప్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి మీద ఫైర్ అవ్వటం ఏంటని కన్ఫ్యూజింగ్ గా ఉందా..?, ఇందుకు కారణం లేకపోలేదు.

వివరాల్లోకి వెళితే, భారీ బడ్జెట్ లో పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ పట్ల అభిమానులతో సహా టాలీవుడ్ మొత్తం ప్రశంసలు కురిపిస్తుంటే డైరెక్టర్ మారుతి మాత్రం సైలెంట్ గా ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్న మారుతి ఇంత పెద్ద ప్రాజెక్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ అయితే, ఏ మాత్రం పట్టించుకోకపోవటం ఏంటని ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు మారుతి అల్లు అర్జున్ ఆరెంజ్ చేసిన బేబీ అప్రిషియేషన్ మీట్ కి సంబంధించిన వీడియో షేర్ చేయటం అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది.

ప్రభాస్, మారుతి సినిమా షూటింగ్ సుమారు 50శాతం వరకు పూర్తయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ విషయంలో రాజా డీలక్స్, రాయల్ వంటి టైటిల్స్ ప్రచారంలో ఉండగా సినిమా యూనిట్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. భారీ యాక్షన్ సినిమాలతో నిండిన ప్రభాస్ లైనప్ లో మారుతి సినిమా రిఫ్రెషింగ్ గా ఉంటుందని అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు