పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి సముద్రఖని డైరెక్షన్లో నటించిన బ్రో సినిమా జులై 28న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ తో సహా నార్మల్ ఆడియెన్స్ సైతం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్లో చాలా కాలం తర్వాత హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కనిపించటం హైలైట్ గా నిలిచింది. థమన్ ఇచ్చిన బీజీఎమ్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసింది. ట్రైలర్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా పర్ఫెక్ట్ గా ప్రాజెక్ట్ అయ్యింది.పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్స్ లో స్టైలిష్ గా కనిపించి మెప్పించిన ఈ ట్రైలర్ లో సీజీ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండుంటే బాగుండన్న ఫీల్ వస్తోంది.
కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి పవర్ స్టార్ స్టైలిష్ లుక్స్ హైలైట్ గా నిలుస్తాయని అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. ఒరిజినల్ సినిమా వినోదాయ సీతాం కి, బ్రో సినిమాకి చాలా మార్పులే చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఆశించిన రేంజ్ లో లేకపోవటం వల్ల కాస్త నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి ట్రైలర్ మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి.
విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత తేజ్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన సినిమా కావటం వల్ల రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 2నిమిషాల 16సెకన్ల ఈ ట్రైలర్ 2గంటల 10నిమిషాల సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. మరి, మామ అల్లుళ్ళ కాంబోలో వస్తున్న మొదటి సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News