#RC16: బుచ్చిబాబు క్రేజీ ప్లాన్ – పాన్ ఇండియా వర్కౌట్ అవుతుందా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా కంప్లీట్ చేసి బుచ్చిబాబు సినిమా వీలైనంత త్వరగా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దాదాపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన బుచ్చిబాబు రామ్ చరణ్ సూచన మేరకు చిన్న చిన్న మార్పులు చేసే పనిలో ఉన్నాడని సమాచారం. సినిమా ఇంకా ప్రారంభం కానప్పటికీ తరచూ ఏదో ఒక అప్డేట్ వినిపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కబడ్డీ బ్యాక్డ్రాప్ లో రుపొండనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించనున్నాడని ఇప్పటికే వచ్చిన అప్డేట్ సినిమాపై ఆసక్తి పెంచుతుండగా తాజాగా మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా వైడ్ రూపొందనున్న ఈ సినిమాను బుచ్చిబాబు కోనసీమ బ్యాక్డ్రాప్ లో ప్లాన్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. బుచ్చిబాబు గత సినిమా ఉప్పెన కూడా కోనసీమ బ్యాక్డ్రాప్ లో రూపొంది బ్లాక్ బస్టర్ కాగా, ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం కూడా అదే బ్యాక్డ్రాప్ ని ప్లాన్ చేస్తున్నాడని వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను పెంచుతోంది. అయితే, పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి కోనసీమ బ్యాక్డ్రాప్ వర్కౌట్ అవుతుందా అన్న చర్చ కూడా మొదలైంది.

RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకునే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఇప్పుడు బుచ్చిబాబు సినిమా కూడా చరణ్ స్టామినాకి ఏ మాత్రం తీసిపోకుండా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషన్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా రామ్ చరణ్ బుచ్చిబాబుకి మరొక బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు