Mahesh Babu: సమస్యా? క్లియర్ చేయడం ఎందుకు.. వెకేషన్ వెళ్లాలి కదా !

సాధారణంగా ఒక్క సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాటు కాస్ట్ అండ్ క్రూ అంతా సెట్ అయి ఉంటుంది. ఒక్క సారి షూటింగ్ స్టార్ట్ చేశారంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, పూర్తి చేసేసి రిలీజ్ చేస్తారు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు దీన్నే ఫాలో అవుతారు. అయితే ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ విషయంలో మాత్రం పెద్ద గందరగోళం జరుగుతుంది. అది ఏదో కాదు… సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం.

ఈ మూవీ స్టార్ట్ అయిన నాటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. రెండు షెడ్యూల్ షూట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి, కొత్త స్టోరీ తీసుకోవడం, స్టంట్ మాస్టర్స్ ను మార్చడం, ఏకంగా హీరోయినే ఛేంజ్ చేయడం, పలువురు అసిస్టెంట్ డైరెక్టర్లు తప్పుకోవడం తో పాటు ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ తో వివాదం అంటూ టాక్. ఇలా నిత్యకృత్యంగా గుంటూరు కారం సినిమాకి ఏదో జరుగుతూనే ఉంది.

నిజానికి ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే, ఆ సినిమా మేకర్స్ రిలీజ్ చేసే అప్డేట్స్ తో ట్రెండింగ్ లో ఉంటుంది. కానీ, గుంటూరు కారం విషయంలో మాత్రం ఇలాంటి గందరగోళ పరిస్థితుల వల్ల ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.

- Advertisement -

సినిమా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు హీరో మహేష్ బాబు కలగజేసుకుని, త్వరగా పూర్తి చేయాలి. కానీ, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించకుండా, బాబు గారు చక్కగా ఫ్లైట్ ఎక్కెసి, వెకేషన్ కి వెళ్లిపోతారు. “ఇక్కడ మీరు కొట్టుకోండి, చావండి… అంతా క్లీయర్ అయ్యాకా చెప్పండి. వచ్చి షూట్ చేసుకుంటా” అని అనుకుంటారో ఏమో అంటూ సోషల్ మీడియాలో సూపర్ స్టార్ పై పంచులు కూడా పడుతున్నాయి.

అయినా, అవేవి సంబంధం లేకుండా, మిల్క్ బాయ్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అంతా బాగానే ఉంది కదా, మహేష్ ఎందుకు వెకేషన్ కి వెళ్లారు అని చిన్న చర్చ జరిగింది. దానిపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఈ మూవీకి ఇప్పటి వరకు కెమెరామెన్ గా పని చేసిన పీఎస్ వినోద్ ను బయటికి పంపించేశారట. వినోద్ స్థానంలో రవి కె చంద్రన్ ని తీసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

రవి కె చంద్రన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాకు చేస్తున్నాడు. OG కి డైరెక్టర్ సుజిత్ అయినా, అన్ని బాధ్యతలు ఎప్పటిలాగే, పవన్ బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు. అలా రవి కె చంద్రన్ ను గుంటూరు కారం మూవీకి తీసుకువచ్చారమో అంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.

అసలు సినిమా ఆలస్యం అవ్వడానికి కారణమేంటి అనే దాన్నిపై ఇంకా చర్చించకుండా, ఉన్న సమస్యలను క్లీయర్ చేసుకుని, షూట్ కంప్లీట్ చేసి, ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు