Bhagavanth Kesari: రిలీజ్ డేట్ వచ్చేసింది – ఈ దసరాకు ట్రయాంగిల్ ఫైట్..!

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో భగవంత్ కేసరి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అయిన అనిల్ రావిపూడి మాస్ కి పెట్టింది పేరైన బాలయ్యల కాంబినేషన్ కావటంతో సినిమా అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లిమ్ప్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ముందుగా ప్రచారం జరిగినట్టుగానే అక్టోబర్ 19న సినిమా రిలీజ్ ఉంటుందంటూ అనౌన్స్ చేశారు మేకర్స్.

అయితే, ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే, రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న రిలీజ్ ఉంటుందని అనౌన్స్ చేయగా, విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న లియో సినిమా కూడా అక్టోబర్ 19వ తేదీని ఫిక్స్ చేసుకుంది. ఇప్పుడు భగవంత్ కేసరి కూడా సేమ్ డేట్ అనౌన్స్ చేయటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రవితేజ, బాలకృష్ణ సినిమాల మధ్య క్లాష్ ఏర్పడటం ఇది మొదటిసారి కాదు, గతంలో ‘ఒక్క మగాడు – కృష్ణ’, మిత్రుడు – కిక్‘, పరమవీర చక్ర – మిరపకాయ్’, సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కాగా రవితేజ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయితే, బాలయ్య సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఈ పరంపర నందమూరి అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. మరో పక్క గత ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, విజయ్ నటించిన వారసుడు మధ్య పోటీలో బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ అయితే, విజయ్ సినిమా తెలుగులో అలరించలేదు. మరి, ఈ దసరాకి బాక్సాఫీస్ వద్ద జరగబోయే ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు నెగ్గుతారో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు