Megastar’s Bholaa Shankar: ఏ మాత్రం తేడా కొట్టినా సర్దుకోవాల్సిందే..!

Megastar’s Bholaa Shankar

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో సైతం పెద్దగా ఆసక్తి కనిపించట్లేదు. డిజాస్టర్ ట్రాక్ ఉన్న మెహర్ రమేష్ డైరెక్టర్ కావడం కూడా ఇందుకు మరో కారణం అని చెప్పాలి. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఉన్న నెగిటివిటీ చాలదన్నట్లు టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏ ఒక్కటి కూడా సినిమాపై ఆసక్తి పెంచలేకపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా రిజల్ట్ డైరెక్టర్ మెహర్ రమేష్ కెరీర్ ని డిసైడ్ చేసే అంశంగా మారింది.

మెహర్ రమేష్ తో పాటుగా ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా నటించిన తమన్నా, మరో హీరో సుశాంత్ లకు కూడా కీలకం అని చెప్పాలి. ఇటీవల టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ లేకపోవటంతో తమన్నా వోటీటీల్లో వెబ్ సిరీస్ లలో నటించటం స్టార్ట్ చేసింది. తమన్నా నటించిన లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ లభించటం, రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ క్లిక్ అవ్వటంతో తమన్నా మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టయింది.

ఇక, భోళాశంకర్ సినిమా కూడా హిట్ అయితే మిల్కీ బ్యూటీకి యంగ్ హీరోల సినిమాల్లో కాకపోయినా సీనియర్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న సుశాంత్, హీరోగా ట్రై చేయటం మానేసి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయటం స్టార్ట్ చేశాడు. ఆ మధ్య వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ పెద్దగా ఆఫర్లు రాలేదు సుశాంత్ కి. ఇక, భోళాశంకర్ సినిమా కూడా సరిగ్గా ఆడకపోతే, సుశాంత్ కెరీర్ ప్రశ్నార్థకం అయ్యే ఛాన్స్ ఉంది. మరి, ఇంతమంది కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న భోళాశంకర్ సినిమా హిట్ అవుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు