Bigboss7: ఈవెంట్ లేనా? సినిమాలేమైనా ఉన్నాయా?

Nagarjuna movie update?

టాలీవుడ్ లో ఇప్పుడు అందరికంటే బ్యాడ్ సిట్యుయేషన్ లో ఉన్న స్టార్ హీరో ఎవరంటే అది నాగార్జున అనే చెప్పాలి. ఒకప్పుడు ఈ హీరో నుండి సినిమా వస్తుందంటే బయ్యర్లు కొనుక్కునేందుకు క్యూ కట్టేవారు. ఆడియన్స్ కొత్త ట్రెండ్ ఎదో స్టార్ట్ అయ్యే సినిమా వస్తుందనుకునేవారు. కానీ గత పదేళ్లలో అంతా మారిపోయింది. ఇప్ప్పుడు రికార్డుల సినిమాలు కాదు కదా, ఒక మాదిరి సినిమాలు కూడా తీయలేకపోతున్నారు. ఊపిరి లాంటి మంచి ఫీల్ గుడ్ సినిమాలు తీసే నాగార్జున ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో కూడా విఫలం అవుతున్నారు.

చివరగా లాస్ట్ ఇయర్ ఘోస్ట్ సినిమాతో పలకరించిన నాగార్జున డిజాస్టర్ అందుకున్నాడు. నిజంగా నాగార్జున స్థాయి సినిమాలు వచ్చి చాలా ఏళ్ళు అయింది. అక్కినేని అభిమానులు కూడా తన నుండి ఒక్క మాస్ సినిమా అయినా రావాలని చాలా కోరుకుంటున్నారు. అయితే నాగార్జున మాత్రం అవేమి పట్టించుకోకుండా బిజినెస్ లపై దృష్టి పెట్టాడు. అప్పుడప్పుడు యాడ్స్ చేస్తూ, ఈవెంట్స్ కి హాజరవుతూ గడిపేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదేదో చిన్న సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వస్తున్నాడు.

ఈ ఈవెంట్ తర్వాత బిగ్ బాస్7 సీజన్ ప్రమోషన్ లో బిజీ అవనున్నాడు నాగార్జున. మరి సినిమాలు చేసేది ఎప్పుడు అని ఆయన ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్న. సినిమాలు చేస్తూ ఇలాంటి ప్రోగ్రాం లు చేసుకోవచ్చు గాని, మొత్తం వాటికే టైం కేటాయిస్తే తన క్రేజ్ పూర్తిగా దెబ్బతింటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. తన తోటి హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్స్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈయన కూడా అలా బిజీ కావాలని కామన్ ఆడియన్స్ కూడా అంటున్నారు. మరి ఆరోజు ఎప్పుడొస్తుందో.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు